యూపీఏ ఎంపీలకు సోనియా విందు | sonia gandhi Banquet to upa mp's | Sakshi
Sakshi News home page

యూపీఏ ఎంపీలకు సోనియా విందు

Published Wed, Jun 11 2014 12:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

యూపీఏ ఎంపీలకు సోనియా విందు - Sakshi

యూపీఏ ఎంపీలకు సోనియా విందు

న్యూఢిల్లీ: యూపీఏ ఎంపీలకు మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటు ప్రాంగణంలో విందు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు, పార్టీకి చెందిన పలువురు నేతలతో పాటు యూపీఏ పక్ష పార్టీలైన ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆరెల్డీ, ఐయూఎంఎల్‌లకు చెందిన ఎంపీలు ఈ విందుకు హాజరయ్యారు. యూపీఏకు మద్దతిస్తున్న ఆర్జేడీ, జేఎంఎంల అధినేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శిబూ సొరేన్‌లు కూడా విందులో పాల్గొన్నారు. విందులో పలు రకాలైన శాఖాహార, మాంసాహార వంటకాలను వడ్డించారు.

 

నిజానికి ఈ విందు కార్యక్రమాన్ని జూన్ 5 వ తేదీన్నే ఏర్పాటు చేయాలని భావించినా.. కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే హఠాన్మరణంతో మంగళవారానికి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement