‘సోనియా రాజకీయాల్లో కొనసాగుతారు’ | Sonia Gandhi retiring as party president, not from politics | Sakshi
Sakshi News home page

‘సోనియా రాజకీయాల్లో కొనసాగుతారు’

Published Fri, Dec 15 2017 2:23 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Sonia Gandhi retiring as party president, not from politics - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ రిటైర్‌మెంట్‌పై వస్తున్న కథనాలపై కాంగ్రెస్‌ పార్టీ వివరణ ఇచ్చింది. సోనియా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి మాత్రమే రిటైర్‌ అవుతున్నారని.. రాజకీయాల్లో ఆమె కొనసాగుతారని కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం స్పష్టం చేసింది.

ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాల్‌ ట్విటర్‌లో తెలిపారు. ‘‘సోనియా గాం‍ధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి మాత్రమే రిటైర్‌ అవుతున్నారు. రాజకీయాలనుంచి కాదని’’ ఆయన ట్వీట్‌ చేశారు. సోనియా గాంధీ మేధస్సు, ఆశీస్సులు పార్టీకి ఎప్పటకీ అవసరమని చెప్పారు.

శీతాకాల సమావేశాలకు హాజరయిన సోనియా గాంధీ తిరిగి వెళుతూ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ‘నేను రాజకీయాలను నుంచి తప్పుకుంటాను’ అని ప్రకటించారు. అంతేకాక మూడేళ్లేగా రాహుల్‌ గాంధీ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారని ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement