అవినీతి రొంపిలో బీజేపీ | bjp said commoncold | Sakshi
Sakshi News home page

అవినీతి రొంపిలో బీజేపీ

Published Sun, Apr 20 2014 3:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

అవినీతి రొంపిలో బీజేపీ - Sakshi

అవినీతి రొంపిలో బీజేపీ

వాళ్లు అవినీతిపై మాట్లాడటమా?  అమేథీలో సోనియాగాంధీ
 
 అమేథీ: కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసున్న పార్టీలే అవినీతి రొంపిలో పీకల్లోతుకు కూరుకుపోయాయని, అలాంటి పార్టీలు అవినీతి గురించి మాట్లాడటం ఏమిటని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి, కుంభకోణాలపైనా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని సవాల్ విసిరారు. శనివారం కుమారుడు రాహుల్‌గాంధీ తనఫున సోనియాగాంధీ అమేథీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ కుటుంబాన్ని గుర్తు చేస్తూ ఓటర్లను భావోద్వేగంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గాంధీల కర్మభూమి కోసం రాహుల్‌గాంధీ చిత్తశుద్ధితో అహర్నిశలు కష్టించి పనిచేస్తున్నారని, అందుకే అమేథీ ప్రజలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలపై ప్రేమ, వాత్సల్యం చూపుతున్నారని తెలిపారు.

అమేథీ ప్రజలు గాంధీ కుటుంబం కోసం భుజం.. భుజం కలిపి పని చేస్తున్నారని, వీరంతా కాంగ్రెస్ విధానాలకు మద్దతిస్తారని, రాహుల్‌గాంధీని, కాంగ్రెస్ అభ్యర్థులను ఆఖండ మెజారిటీతో గెలిపిస్తారని తాను నమ్ముతున్నానని చెప్పారు. కాగా,ఎన్నికల ప్రచారం సందర్భంగా సోనియా..ప్రియాంక పేరును ప్రస్తావించడం చాలా అరుదు. అమేథీ ప్రచారం సమయంలో ఆమె ప్రియాంక పేరు ను ప్రత్యేకించి ప్రస్తావించడం గమనార్హం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులం, మతం వంటి అంశాలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తోందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement