ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన తొలిరోజే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ తెలిపారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిందని ఆయన విమర్శించారు. యూపీఏతోనే ఏపీ ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.
టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను సమానంగా వ్యతిరేకిస్తున్నామన్న ఉమెన్ చాందీ.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదన్నారు. అయితే పార్టీ అజెండా, పొత్తులపై ఇప్పుడే చర్చించడం తొందరపాటు నిర్ణయం అవుతుందన్నారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పార్టీని విడిచి వెళ్లినవారు తిరిగి వస్తే తప్పక స్వాగతిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment