'ఆ బిల్లు యూపీఏ బేబి' | Congress feels BJP will get credit for GST: Rudy | Sakshi
Sakshi News home page

'ఆ బిల్లు యూపీఏ బేబి'

Published Wed, Feb 3 2016 6:48 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

'ఆ బిల్లు యూపీఏ బేబి'

'ఆ బిల్లు యూపీఏ బేబి'

గువాహటి: కావాలనే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఈ బిల్లు పాసయితే ఆ క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్రమోదీ ఖాతాలోకి వెళ్లిపోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని చెప్పారు. గురువారం ఆయన గువాహటిలో జీఎస్టీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.

'దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని నమ్ముతోంది. అదేమిటంటే జీఎస్టీ బిల్లు పాసయితే ఆ ఖ్యాతి కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి దక్కుతుందని' అని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు పాసవకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. అసలు ఒకప్పుడు యూపీఏకు ఈ బిల్లు పుత్రికలాంటిదని, చాలామంచి చట్టం అని అభివర్ణించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement