
రెండు విడతలుగా 'నీట్' పరీక్ష
న్యూఢిల్లీ: జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా ఏకీకృత వైద్య విద్య ప్రవేశపరీక్షను నిర్వహించాలని నిర్వహించాలని ఆదేశించింది. నీట్ పరీక్షను రెండు విడతలుగా ప్రవేశపరీక్షను నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ నీట్ను అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. మే 1, జూన్ 24న నీట్ పరీక్ష నిర్వహించి, ఆగస్టు 17న ఫలితాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి కౌన్సిలింగ్ పూర్తి చేసి అక్టోబర్ 1నుంచి తరగతులు ప్రారంభించాలని సూచన చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే నీట్ అమలు కానుంది.
కాగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎంసెట్ పరీక్ష యథాతథంగా ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు సమాచారాన్ని తీసుకుంటామని, అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురి కావద్దని ఆయన సూచించారు.