
‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’
పీవీ హెచ్చరించారన్న మన్మోహన్
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌ను 1991లో ఆర్థికమంత్రిగా నియమించడం, అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం. నిద్రలో ఉన్న మన్మోహన్‌ను రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ ఈ విషయం తెలియపరిచారు.
పైగా,.. సరిగా పనిచేయకపోతే ఉద్వాసన తప్పదంటూ పీవీ చమత్కారంగా హెచ్చరిక కూడా జారీచేశారట. మన్మోహన్ సింగ్ స్వయంగా ఈ విషయం తనతో చెప్పారంటూ ఆయన కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్‌లీ పర్సనల్ అన్న శీర్షికతో రాసిన పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు.