prime minister manmohan singh
-
టీడీపీ, బీజేపీల వైఖరేంటో తేలుతుంది
► ప్రత్యేక హోదాపై ఎన్డీయే సర్కారువి కుంటిసాకులు ► వర్షాకాల సమావేశాల్లోనే కేవీపీ బిల్లు ► ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ బీజేపీ, టీడీపీలకు అగ్ని పరీక్షలాంటిదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో కేవీపీ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ బిల్లుపై ఓటింగ్ సమయంలో బీజేపీ, టీడీపీల వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. ఆ పార్టీలు నిజంగా ఏపీ అభివృద్ధిని కోరుకుంటే.. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతివ్వాలని అన్నారు.ఈ చరిత్రాత్మక బిల్లుకు సభ ఆమోదం లభిస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉందన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీ, అప్పట్లో కేంద్ర కేబినెట్ చేసిన నిర్ణయం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. విభజన చట్టంలో నిబంధన లేదని ఎన్డీయే ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని విమర్శించారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించిన సమయంలోనూ ఈ అంశం చట్టంలో లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రత్యేక హోదా కల్పించారని దిగ్విజయ్ గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదన్న వాదనలో పస లేదని తేల్చిచెప్పారు. టీడీపీపై మాకు భరోసా లేదు ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే కేబినెట్ నిర్ణయం ద్వారా ఇవ్వొచ్చని దిగ్విజయ్‌సింగ్ సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని యూపీఏ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించిందని, ఇప్పుడు దాన్ని అమలు చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల వీడ్కోలుకు సమయాన్ని కేటాయించాలని రాజ్యసభ సభా వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని చెప్పారు. అందువల్ల ప్రైవేట్ మెంబర్ బిల్లును వర్షాకాల సమావేశాల్లో చేపడతారని తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పార్టీ సభ్యులకు మూడు లైన్ల విప్‌ను జారీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. బిల్లుకు టీడీపీ మద్దతిస్తుందన్న భరోసా ఉందా? అన్న ప్రశ్నకు... ‘టీడీపీపై ఎవరికైనా భరోసా ఉంటుందా, మాకు భరోసా లేదు. ఒకవేళ మద్దతిస్తే ఆ పార్టీ విశ్వసనీయత పెరుగుతుంది’’అని దిగ్విజయ్ బదులిచ్చారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం పాల్గొన్నారు. ఓటింగ్‌కు రాకుండా బీజేపీ కుట్ర: కేవీపీ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం అడ్డుకున్నప్పటికీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోదం అభిస్తుందని ఆయన అన్నారు. రాజద్రోహం: రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే, పదేళ్లు ఇస్తామని బీజేపీ నేతలు, 15 ఏళ్లు కావాలని టీడీపీ నేతలు చెప్పారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గుర్తుచేశారు. రెండేళ్ల కాలయాపన తర్వాత హోదా ఇవ్వబోమని ఎన్డీయే ప్రభుత్వం నిస్సిగ్గుగా తేల్చిందని విమర్శించారు. బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా బీజేపీ, టీడీపీ రాజద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. -
‘మహా’ ప్రచారానికి స్టార్ క్యాంపైనర్స్
ముంబై: ఈ నెల 15వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగనున్న ప్రచార సభల్లో ఆయా పార్టీల అతిరథమహారథులు పాల్గొననున్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నందున జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అధినేతలను వీలైనన్ని ప్రచార సభల్లో పాల్గొనెలా చేసి లబ్ధిపొందాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే ఆయా పార్టీలకు చెందిన ‘స్టార్ కేంపైనర్స్’ పాల్గొననున్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం అందించిన సమాచారం మేరకు.. 54 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల లిస్ట్‌ను బీజేపీ అందజేసింది. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.అలాగే బాలీవుడ్ నటులు, పార్టీ ఎంపీలు అయిన హేమామాలిని, పరేష్ రావల్, వినోద్ ఖన్నా, బబుల్ సుప్రియోల సేవలు కూడా వినియోగించుకోనున్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఎంపీ జ్యోతిరాదిత్య, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, నటి నగ్మా తదితరులు ప్రచార సభల్లో స్టార్ ప్రచారకులుగా పాల్గొననున్నారు. అలాగే శివసేన తరఫున పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే, నటుడు అమోల్ కోహ్లీ, టీవీ నటుడు ఆదేశ్బండేకర్ సహా 36 మంది ప్రచారసభల్లో ‘స్టార్ క్యాంపైనర్లు’గా పాల్గొననున్నారు. లెఫ్ట్ పార్టీ తరఫున పదిమంది ప్రచారకులు పాల్గొననుండగా వారిలో ఎ.బి. బర్దన్ కూడా ఉన్నారు. అలాగే రాష్ట్రీయ సమాజ్ పార్టీ తరఫున మహదేవ్ జంకార్ సహా 11 మంది ప్రచారసభల్లో పాల్గొననున్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ తరఫున పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఎమ్మెన్నెస్ తరఫున ఆ పార్టీ అధినేత రాజ్‌ఠాక్రేతోపాటు 16 మంది నేతలు ప్రచార బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 45 స్థానాలకు పోటీచేస్తున్న గరీబ్ ఆద్మీపార్టీ తరఫున ఆపార్టీ కన్వీనర్ శ్యాం భరద్వాజ ‘స్టార్ క్యాంపైనర్’గా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
2జీ, కోల్‌గేట్‌లో మన్మోహన్!
స్కామ్‌లలో ఆయన ప్రమేయం ఉంది: మాజీ కాగ్ వినోద్ రాయ్ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మాజీ కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) గురువారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ అధినేతగా మన్మోహన్ సింగ్ వ్యవహార శైలిని, ఆయన నేతృత్వంలో సాగిన సంకీర్ణ రాజకీయాలను కూడా తూర్పారబట్టారు. మన్మోహన్ కేవలం, పదవిలో సుదీర్ఘకాలం కొనసాగడానికే ప్రాధాన్యం ఇచ్చారంటూ దుయ్యబట్టారు. 2జీ స్పెక్ట్రం, బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో మన్మోహన్ సింగ్‌కు ప్రమేయం ఉందన్నారు. ఆడిట్ నివేదికల్లో ప్రధాన మంత్రి పేరు ప్రస్తావన కూడా లేకుండా చేయడానికి కాంగ్రెస్ నేతలు పలువురు తనపై ఎన్నో ఒత్తిళ్లు తీసుకువచ్చారని వినోద్ రాయ్ చెప్పారు. టైమ్స్ నౌ టీ వీ న్యూస్ చానల్‌కు, అవుట్‌లుక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలలో ఆయన ఈ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉంటూ, నిజాయితీగా వ్యవహరించడం కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమేకాదని, అది మేధస్సుతోను, వృత్తినైపుణ్యంతోనూ కూడుకున్న వ్యవహారమని ఆయన మన్మోహన్ సింగ్‌కు సూచించారు. రాజ్యాంగం పేరుమీద ప్రమాణం స్వీకరించిన సంగతిని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. రాజ్యం చేతిలో జాతిని అణచివేతకు గురికానివ్వరాదని, మంచి రాజకీయాలు సరైన ఆర్థిక వ్యవహారాలకు దారి తీయాలని, అయితే మంచి రాజకీయాలంటే ఎక్కువకాలం పదవిలో కొనసాగడమని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు. తాను పదవిలో ఉండగా తన టెలిఫోన్‌ను యూపీఏ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు. 2జీ స్పెక్ట్రమ్‌ను మొదట వచ్చినవారికి మొదట అనే ప్రాతిపదికన కేటాయించడం, బొగ్గు బ్లాకులను వేలం లేకుండా కట్టబెట్టడం వంటి నిర్ణయాల్లో మన్మోహన్ సింగ్‌కు పాత్ర ఉందన్నారు. 2జీ, బొగ్గు బ్లాకుల వ్యవహారాల్లో మన్మోహన్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలరన్నారు. రాయ్ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు ►2జీ వ్యవహారంలో అప్పటి కేంద్రమంత్రి ఏ రాజా తన లేఖలను ప్రధానికే రాశారు. వాటికి ప్రధానే స్వయంగా తిరుగు జవాబులు రాశారు. నేను రాసిన లేఖలకు మాత్రం బదులివ్వలేదు. ► 2జీ వ్యవహారంలో నష్టాన్ని రూ. 1.76లక్షల కోట్లుగా లెక్కగట్టడం సరికాదని 2010 నవంబర్ 16న మన్మోహన్ నాతో అన్నారు. మీరు నేర్పించిన ఆర్థిక గణితశాస్త్ర పద్ధతిలోనే ఆ లెక్కవేశానంటూ ఆయనకు బదులిచ్చాను. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ కేసు విషయంలో మంత్రి స్థాయిలో నిర్ణయం జరగనే లేదు. ముకేశ్ అంబానీయే అంతా నడిపించారు. ► 2జీ, బొగ్గు బ్లాకుల ఆడిట్ నివేదికలో ప్రధాని పేరు ప్రస్తావించరాదంటూ సందీప్ దీక్షిత్, సంజయ్ నిరుపమ్, అశ్వనీ కుమార్ వంటి కాంగ్రెస్ ఎంపీలు నాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ►2జీ కుంభకోణం జరక్కుండా ప్రధాని హోదాలో మన్మోహన్ చర్యలుతీసుకుని ఉండవచ్చు. ఎందుకంటే, ప్రకృతి వనరులను వేలంలేకుండా కేటాయించడం సరికాదని ఆయన మంత్రివర్గమే సూచించింది. ►కోల్‌బ్లాక్ కే టాయింపులో ఉన్న లోపాలను, దిద్దుబాటు చర్యలను గురించి, నేను, ప్రణబ్ మఖర్జీతో కలసి మన్మోహన్ సింగ్ వివరించినా ప్రయోజన లేకపోయింది. ►సంకీర్ణ ఒత్తిళ్ల వల్లే యూపీఏ సర్కారు స్కామ్‌లపై తగు రీతిలో స్పందించలేదు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
పేర్లు తీసేయాలని ఒత్తిడి చేశారు
కోల్గేట్, కామన్వెల్త్ గేమ్స్ ఆడిట్ నివేదికల్లో కొన్ని పేర్లు తొలగించమన్నారు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్పై మాజీ కాగ్ వినోద్ రాయ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మరో మాజీ ఉన్నతాధికారి గళమెత్తారు. కోల్గేట్, కామన్వెల్త్ గేమ్స్ స్కాం ఆడిట్ రిపోర్టుల నుంచి కొన్ని పేర్లు తొలగించాలని అప్పటి రాజకీయ నేతలతో తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆ పేర్లు తప్పించేలా తనను ఒప్పించడానికి తన సహచర ఐఏఎస్‌లతో కూడా ప్రయత్నించారన్నారు. ఈ విషయాలన్నీ అక్టోబర్‌లో విడుదల చేయబోయే తన పుస్తకం ‘నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్’లో వివరిస్తానని పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మన్మోహన్ సింగ్, యూపీఏ ప్రభుత్వంపై ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు ఏ విధంగా నష్టం జరిగిందనే విషయాలపై పూర్తి స్థాయిలో వివరిస్తానని రాయ్ తెలిపారు. ‘‘ప్రధాని కీలకమైన వ్యక్తి. ఆయన తుది నిర్ణయం తీసుకోవాలి. మన్మోహన్ కొన్ని సార్లు తీసుకున్నారు. కొన్ని సార్లు తీసుకోలేదు. అధికారం నిలబెట్టుకోవడానికి అన్నింటినీ త్యాగం చేయకూడదు. సంకీర్ణ రాజకీయాలకోసం పాలనను బలి చేయకూడదు. అవన్నీ నేను పుస్తకంలో చెప్పాను’’ అని మాజీ ప్రధానిపై రాయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ నిష్క్రియాపరత్వంపై పీసీ పరేఖ్, సంజయ్ బారు, నట్వర్‌సింగ్ తమ పుస్తకాల్లో విమర్శించడం తెలిసిందే. అదే తరహాలో రాయ్ కూడా అప్పటి ప్రభుత్వంపై పెన్ను ఎత్తడం దుమారం రేపుతోంది. గతేడాది పదవి నుంచి నిష్ర్కమించిన రాయ్.. 2జీ, కోల్‌బ్లాక్ స్కాంలలో ప్రభుత్వం నష్టపోయిన నిధుల్ని అంచనావేశారు. కాంగ్రెస్ మండిపాటు.. ఈ మధ్యన ఏదోటి రాస్తూ.. దాన్ని సంచలనం చేస్తూ రిటైర్మెంట్ తర్వాత పింఛను సంపాదనలా మారిన దాన్ని రాయ్ కూడా అనుసరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ మండిపడ్డారు. ఆయన చెప్పిన విషయాలపై చర్చకైనా సిద్ధమన్నారు. మన్మోహన్ మౌనం వీడాలి.. బీజేపీ నేత విజయ్ శంకర్ శాస్త్రి మాట్లాడుతూ.. మన్మోహన్ మాట్లాడే సమయం ఆసన్నమైందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల్ని దుర్వినియోగం చేసిందన్నారు. -
‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’
పీవీ హెచ్చరించారన్న మన్మోహన్ న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌ను 1991లో ఆర్థికమంత్రిగా నియమించడం, అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం. నిద్రలో ఉన్న మన్మోహన్‌ను రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ ఈ విషయం తెలియపరిచారు. పైగా,.. సరిగా పనిచేయకపోతే ఉద్వాసన తప్పదంటూ పీవీ చమత్కారంగా హెచ్చరిక కూడా జారీచేశారట. మన్మోహన్ సింగ్ స్వయంగా ఈ విషయం తనతో చెప్పారంటూ ఆయన కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్లీ పర్సనల్ అన్న శీర్షికతో రాసిన పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు. -
నల్లగొండపై... నజర్
సాక్షిప్రతినిధి, నల్లగొండ, మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుండగా, 28వ తేదీన సాయంత్రం 5గంటలకు ప్రచారం పరిసమాప్తం కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలూ వీటిని కీలకంగా భావిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించిన టీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్, ఇలా.. ఈ మూడు పార్టీలూ తెలంగాణ సెంటిమెంటు ఓటుపై ఆశలు పెట్టుకున్నాయి. వీటితో పాటు జాతీయస్థాయిలో తెలంగాణ ఏర్పాటుకు సహకరిం చిన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) తెలంగాణ శాఖ సైతం అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ నేత చంద్రబాబు జిల్లాలో పర్యటించారు. కాగా, ఇపుడు ఆయా పార్టీల అభ్యర్థుల కోసం ముఖ్య నాయకులు ప్రచారానికి జిల్లాపై ముప్పేట దాడి చేయనున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని భువనగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటున్నారు. ఈ సభ శని వారం జరగనుంది. దీంతో కాంగ్రెస్ నాయకులతో పాటు, అధికార యంత్రాంగం సైతం ప్ర ధాని సభ ఏర్పాట్లలో మునిగిపోయాయి. లోక్‌సభలో బీజేపీ నేత సష్మాస్వరాజ్ కూడా ఇదే రోజు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరి ధిలో పర్యటిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా, భువనగిరి లోక్‌సభ పరిధిలోని ఆలే రు, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కాసం వెంకటేశ్వర్లు, గంగిడి మనోహర్‌రెడ్డి, చెరుకు లక్ష్మి బరిలో ఉన్నారు. మునుగోడులో బీజేపీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ మనోహర్‌రెడ్డి పోటీలో ఉండడంతో సుష్మాస్వరాజ్ బహిరంగ సభను చౌటుప్పల్‌లో ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున 25వ తేదీన జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్ లో పర్యటించాల్సిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఒకరోజు వాయిదా పడింది. 26వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగనుంది. తొలిసారి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ (టీఆర్ఎల్డీ) నుంచి ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ భువనగరి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ 25వ తేదీన మునుగోడులో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ మరుసటి రోజు ఆలేరులో అజిత్‌సింగ్‌తో పాటు సినీ నటి జయప్రద, అమర్‌సింగ్‌లు కూడా టీఆర్ఎల్డీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పర్యటించనున్నా రు. మొత్తంగా అన్ని పార్టీల ముఖ్య నే తలు రెం డు మూడు రోజుల్లో జిల్లా ప్రచారానికి వస్తుండడంతో ఆ పార్టీల కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. -
దిగ్గజాల రాజకీయ క్షేత్రంలో కులానిదే బలం!
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, డిఫెన్స్ కాలనీ వంటి సంపన్న కాలనీలతోపాటు దేవ్లీ వంటి కుగ్రామాలతో కూడిన దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం దిగ్గజాలు పోటీపడిన రాజకీయ క్షేత్రంగా గుర్తింపు పొందింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పరాజయాన్ని చవిచూపించి, ఎన్నికల రాజకీయాలంటే ఆయనకు దడ పుట్టించిన నియోజకవర్గమిదే. బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ కూడా రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. కుల సమీకరణాలకే పెద్దపీట వేసే ఈ నియోజకవర్గంలో కుల సమీకరణాలు 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో మారిపోయాయి. అంతవరకు పంజాబీ, సిక్కు ఓటర్లు అధికంగా ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపేవి. కానీ 2008 తర్వాత నియోజకవర్గంలో జాట్, గుజ్జర్ ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. దానితో రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యాలను కూడా మార్చాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్ జాట్ కులానికి చెందిన రమేష్ కుమార్‌ను బరిలోకి దింపగా, బీజేపీ గుజ్జర్ కులానికి చెందిన రమేష్ బిధూరీని నిలబెట్టింది. ఈ సారి ఎన్నికల్లో కూడా ఈ పార్టీలు ఈ ఇద్దరికే మళ్లీ టికెట్లను ఇచ్చాయి. మోడీ మేనియాపైనే బీజేపీ ఆశలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం నేపథ్యంలో రమేష్ కుమార్‌ను కాకుండా మరో అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్న కాంగ్రెస్ ఆఖరి క్షణంలో మళ్లీ ఆయనకే మళ్లీ టికెట్ ఇచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో ముక్కోణపు పోరు జరిగినప్పటికీ దక్షిణ ఢిల్లీ ఓటర్లు బీజేపీ వైపే అధిక మొగ్గు చూపారు. ఈ నియోజకవర్గం పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ఏడింటిని బీజేపీ దక్కించుకుంది. దీంతో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం తనదే అన్న ధీమాతో ఉంది. అందుకే గత లోక్‌సభ ఎన్నికలలో 93 వేల ఓట్ల తేడాతో రమేష్ కుమార్ చేతిలో ఓడిపోయిన రమేష్ బిధూరీకే మళ్లీ టికెట్ ఇచ్చింది. రమేష్ బిధూరీ తుగ్లకాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసన భ్యునిగా ఎన్నికయ్యారు. గుజ్జర్ ఓట్లతో పాటు నరేంద్ర మోడీ చరిష్మా బిధూరీని గెలిపిస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు జాట్ అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం వల్ల జాట్ ఓట్లు చీలవచ్చని, అదీకాక ముజఫర్‌నగర్ అల్లర్ల ప్రభావం వల్ల జాట్ ఓటర్లు తమకు మద్దతు ఇవ్వవచ్చని బీజేపీ ఆశిస్తోంది. ఆప్నే గెలిపిస్తారు: సెహ్రావత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండింటి ఓటు బ్యాంకును కొల్లగొట్టి మూడు సీట్లను గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ దేవేంద్ర సెహ్రావత్‌కు టికెట్ ఇచ్చింది. రిటైర్డ్ కల్నల్ దేవేంద్ర సె్రహావత్ మహిపాల్‌పూర్‌కు చెందిన జాట్ నాయకుడు. ఐదారు సంవత్సరాలుగా స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గ్రామపంచాయతీ స్థలాన్ని స్వాధీనపర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దక్షిణ ఢిల్లీలో నీటి ఎద్దడిని పరిష్కరించడానికి జలాశయాలను సంరక్షించాలని ప్రచారోద్యమం జరిపారు. ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజ్వాసన్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పరిస్థితి మారిపోయిందని, అప్పట్లో ఆప్ అంటే తెలియక చాలా మంది ఓటర్లు ఆప్‌కు ఓటేయలేదని, ఇప్పుడు ప్రజల మద్దతు తనకు ఉందని సెహ్రావత్ అంటున్నారు. కుల సమీకరణాల కన్నా ప్రజా సమస్యలు ఎన్నికల్లో అధిక ప్రభావం చూపుతాయని ఆయన అంటున్నారు. నీటి ఎద్దడి ఇక్కడి ప్రధాన సమస్య. ట్యాంకర్ మాఫియాను ఎదుర్కొనే సాహసాన్ని ఆప్ సర్కారు చూపిందని, అందువల్ల కులసమీకరణాలు ఎలా ఉన్నా ఓట్లు తనకే అంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రెండేసి రోజులు గడిపి, స్థానికుల సమస్యలను తెలుసుకునే లా వ్యూహం రూపొందించిన ట్లు ఆయన చెప్పారు. -
ప్రధానిపై అనంతపురంలో కేసు
అనంతపురం: ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీపై అనంతపురం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలయింది. న్యాయవాదులు మల్లికార్జున, నాగన్న ఈ కేసు దాఖలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. దీనికి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ బాధ్యులని వారు ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని పిటిషన్లో న్యాయవాదులు కోరారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని పలు పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
నేడు ప్రధానితో చర్చలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక సముద్రతీర భద్రతా దళాల వేధింపులతో విసిగివేసారిన తమిళ జాలర్లు నేరుగా ప్రధానికే మొరపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జాలర్ల సంఘాలకు చెందిన 20 మందితో కూడిన ప్రతినిధి బృందం చెన్నైలో గురువా రం ఢిల్లీకి పయనమైంది. తమ దేశ సరిహద్దులోని కచ్చదీవుల వద్ద తమిళ జాలర్లు చేపలవేట సాగిస్తున్నారని శ్రీలంక ప్రభుత్వం ఆరోపిస్తోంది. చేపల వేటకు వెళ్లిన జాలర్లపై శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు దాడులకు దిగడంతోపాటు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నాయి. వారి పడవలను అపహరించుకు వెళుతున్నాయి. వలలను ధ్వంసం చేస్తున్నాయి. హద్దు దాటలేదన్న తమిళ జాలర్ల గోడును శ్రీలంక వినిపించుకోవడం లేదు. జాలర్ల సంఘాల లెక్క ప్రకా రం శ్రీలంక జైళ్లలో 210 మంది మగ్గుతున్నారు. 75 మరపడవలు వారి కబంద హస్తాల్లో చిక్కుకున్నాయి. శ్రీలంక దాష్టీకా న్ని ముఖ్యమంత్రి జయలలిత అనేక ఉత్తరాల ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. డీఎంకే అధినేత కరుణానిధి సైతం కేంద్రానికి అనేకసార్లు విన్నవించారు. ఇటీవల శ్రీలంకలో కామన్వెల్త్ సమావేశాలు జరిగినప్పుడు జాలర్ల సమస్యను ప్రస్తావించాలని రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా ప్రయో జనం లేదు. ఈ క్రమంలో కేంద్రం నిర్లక్ష్యం గా వ్యవహరించడం వల్లే దాడులు పెరిగిపోయాయని జాలర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నాగపట్నం జిల్లా అక్కరపేటకు చెందిన జాలర్ల కుటుంబాల వారు ఈ నెల 11వ తేదీ నుంచి, తాలూకాకు చెందిన జాలర్లు 16వ తేదీ నుంచి దీక్షలు ప్రారంభించారు. కొందరు చేపల వేటను బహిష్కరించారు. ఇదిలా ఉండగా నాగపట్నం, పుదుకోట్టై జాలర్ల సంఘాల నేతలు ఈ నెల 12 వ తేదీన సీఎం జయలలితను చెన్నైలో కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. స్పందించిన ఆమె ప్రభుత్వ పరం గా అన్నిరకాల మద్దతు ఇస్తానని వారికి హామీ ఇచ్చారు. అలాగే ఆయా సంఘాల వారు డీఎంకే అధినేత కరుణానిధిని కూడా కలిశారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ పార్లమెంటరీ నేత టీఆర్ బాలు నాగపట్నం వెళ్లి జాలర్లతో చర్చలు జరిపారు. ప్రధాని వద్దకు తీసుకెళతానని టీఆర్ బాలు హామీ ఇవ్వడంతో ఈ నెల 24వ తేదీన జాలర్లు సమ్మె విరమించారు. మరో వర్గం మాత్రం తమ విధుల బహిష్కరణను కొనసాగిస్తోంది. వారి దీక్ష గురువారానికి 16 వ రోజుకు చేరుకుంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు టీఆర్ బాలుతో కలిసి 20 మందితో కూడిన జాలర్ల సంఘాల ప్రతినిధులు చెన్నై విమానాశ్రయంలో గురువారం బయలుదేరారు. -
తిరస్కారమే పురస్కారమా?
ప్రధాని మన్మోహన్సింగ్ ప్రతిపక్షం చేతిలోగాక, కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పదేపదే అవమానాలను ఎదుర్కొంటున్నారు. రాహుల్‌గాంధీ, ఆ ఆర్డినెన్స్‌ను పూర్తి అర్థరహితమైనదంటూ తీసిపారేయడానికి ముందు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, కమల్‌నాథ్‌ల వంటి వారంతా దానికి మద్దుతు పలికినవారే. కాంగ్రెస్ హిట్‌లిస్ట్‌లో నరేంద్రమోడీ మొట్టమొదటివారైతే, మన్మోహన్‌ది ఆ తర్వాతి రెండో స్థానం. ఎన్నికల మహా సంరంభపు జాతరలో గలీజు గణాం కాలు ఊరేగటం మనకు సుపరిచితమే. ఇక కుయుక్తుల మాటకొస్తే అది మరో కథ. మిట్టమధ్యాహ్నపు ఎండలో గారడీవాడు ప్రదర్శించే కనికట్టుకూ, అమాస రాత్రి స్మశానంలో భూత మాంత్రికుడు సాగించే అన్వేషణకూ ఉన్నంత తేడా ఆ రెంటికీ మధ్యన ఉంది. బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాలుకు ప్రతిగా కాంగ్రెస్ సమన్వయంతో సాగిస్తున్న ఎదురుదాడిలో ఆర్థిక మంత్రి పి. చిదంబరం గణాంకాల చేత శీర్షాసనం వేయించారు. ఆ విషయంలో బీజేపీ తాను ఒంటరిన ని భావించనవసరం లేదు. దానికి తోడు ప్రణబ్‌ముఖర్జీ ఉన్నారు. చిదంబరం తనకు ముందు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి అలాంటి ఎత్తుగడలనే ప్రయోగించారు. అయితే ఈసారి చిదంబరం చూపిన హస్తలాఘవం విభిన్నమైనది. ఎన్డీఏ, యూపీఏ పాలనా కాలాల వృద్ధి రేట్లను ఆయన... వృద్ధి ఊర్ధ్వ ముఖంగా సాగుతున్నదా లేక అథోముఖంగా పయనిస్తున్నదా అనే ప్రస్తావనే లేకుండా మధ్యంతర కాలపు సగటులను సరిపోల్చారు. కొండమీదికి ఎక్కుతున్నా, దిగువకు పోతున్నా సగటు ఎత్తు మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. ఎన్డీఏ తనకు సంక్రమించిన అధ్వాన్నపు వృద్ధి రేట్లను 8 శాతానికి పైకి తీసుకుపోయింది. ఉన్నతస్థాయి వృద్ధి రేట్లతో ప్రారంభించిన యూపీఏ ఎగుడు దిగుడుల మధ్య వాటిని కిందకు దిగజార్చింది. చిదంబరం వాదనలు కాంగ్రెస్ పక్షపాతుల కేరింతలను దాటి పయనించలేవు. విలువ కోల్పోయిన ఆదాయాలతో కూరగాయలను కొనుక్కునే ఓటర్‌కు అసలు నిజం తెలుసు. అధికార పక్షపు కుయుక్తుల శాఖ నడిపేది మరింత విషపూరితమైన వ్యవహారం. జల్లిన బురద కొద్దిగానైనా అంటుకోకపోతుందా అనే భావనతో అది ఆరోపణలను తయారుచేస్తుంది. అయితే బురదను జల్లేప్పుడు మీ చేతులు కూడా మలినం కాక తప్పవు. కుయుక్తుల శాఖ జిత్తులమారి ఎత్తుగడలు ప్రజల్లో చెల్లుబాటు కావు. ఇవి యూపీఏ పోరాడుతున్న మొదటి ఎన్నికలేమీ కావు. నేటితో పోలిస్తే 2009 ఎన్నికల ప్రచారం దివ్యమైన పరిశుద్ధతను నేర్పే పాఠం లాంటివి. శత్రువుల జాబితాను తయారుచేసి, వారిపైకి బురదజల్లే బ్రిగేడ్‌ను సమీకరించక తప్పని స్థితిలో నేడు అధికార పార్టీ ఉంది. 2009లో సైతం యూపీఏకు ఆందోళన కలిగించిన అంశాలు లేకపోలేదు. వాటిలో ‘ఓటుకు నోటు’ కుంభకోణం తక్కువదేమీ కాదు. అయినాగానీ ఆనాడు కాంగ్రెస్ వద్ద చెప్పుకోడానికి సానుకూలమైన కథనం కూడా ఉండేది. యువతరంలో అది ఆశలను రేకెత్తించగలిగింది. ఆ ఆశలన్నీ ఇప్పుడు బుగ్గయి పోయాయి. ఎన్నికలపరమైన దాని పర్యవసానాలు రోజురోజుకు ప్రస్ఫుటమవుతున్నాయి. అయితే కాంగ్రెస్‌కు హానికరమైన నష్టాన్ని కలుగజేస్తున్నది అధికార వ్యవస్థలో నెలకొన్న పూర్తిస్థాయి గందరగోళమే. ప్రధాని మన్మోహన్సింగ్ ప్రతిపక్షం చేతిలోగాక, కాంగ్రెస్‌పార్టీ చేతుల్లో పదేపదే అవమానాలను ఎదుర్కొంటున్నారు. శిక్షలుపడ్డ రాజకీయ నేతల ఆర్డినెన్స్ విషయంలో ఆ పార్టీలో నెలకొన్న అయోమయం, హఠాత్తుగా పార్టీ వైఖరి తలకిందులు కావడం ఆ గందరగోళంలోని ఒక సంచలనాత్మక ఘటన మాత్రమే. రాహుల్‌గాంధీ, ఆ ఆర్డినెన్స్‌ను పూర్తి అర్థరహితమైనదంటూ తీసిపారేయడానికి ముందు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, కమల్‌నాథ్‌ల వంటి భారీ వస్తాదులంతా దానికి మద్దుతు పలికినవారే. రాహుల్ భాషను చూస్తే ఒకింత ముందస్తుగా సన్నద్ధమై మాట్లాడినట్టుఉంది. ఆయన మాటలు అత్యున్నత విధానపరమైన వివాదంగా కంటే క్రీడా మైదానంలో మాటకు మాట విసరడం లాగే ధ్వనించాయి. ఏదేమైనా, అదే కాంగ్రెస్ అభిప్రాయం. అయితే మన్మోహన్ తన మంత్రివర్గ సహచరులతో సహా వెంటనే రాజీనామా చేయాలి. ప్రధాన మంత్రికి, అధికార పార్టీకి మధ్య అలాంటి యుద్ధం ఇంతకు మునుపెన్నడూ ఎరుగనిది. అయితే వ్యవహారం అంతవరకు రాకపోవచ్చు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ వైఖరిలోని మార్పునకు కారణం రాజకీయాలే తప్ప సూత్రబద్ధత కాదు, మంత్రివర్గం ఆ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు రాహుల్‌గాంధీ దానిని వ్యతిరేకించ లేదు. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారిన తరువాత, ఆ ఆర్డినెన్స్‌పై హడావిడిగా సంతకం చేయాల్సిన అవసరం లేదని నమ్మడానికి తగిన కారణాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపిన తర్వాత ఆయన దాన్ని వ్యతిరేకించారు. దాదాపు దశాబ్ద కాలంగా ప్రధానిగా ఉన్న మన్మోహన్ వ్యక్తిగత ప్రతిష్టలోని చివరి పెచ్చులు కూడా నుగ్గునుగ్గు కావడం చూడాల్సిరావడం ఇబ్బందికరమే. పాకిస్థాన్‌తో శాంతిని సాధించడానికి, అమెరికాతో గతిశీలమైన నూతన సంబంధాలను నెలకొల్పడానికి మన్మోహన్ చొరవ చూపారు. ఆ రెండు దిశలుగా ఆయన చేసిన కృషి ఒక్కసారే బోర్లపడింది. ఈ వారం అమెరికాలోనే అది తారస్థాయికి చేరడం కాకతాళీయమే. మన్మోహన్ శ్వేతసౌధ సందర్శన ఎలాంటి లక్ష్యాలు లేని పదవీ విరమణ విందులాగా సాదరపూర్వక మైనదే. ఇక నవాజ్ షరీఫ్‌తో ఆయన సంభాషణలు ప్రారంభం కావడానికి ముందే జమ్మూలోని ఉగ్రవాద రక్తపాతంతో నెత్తురోడాయి. మొదటిది ఏ ప్రాధాన్యమూ లేని ఘటన కాగా, రెండోది అసలు మొదలు కానే లేదు. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు ప్రధానికి భంగపాటు కలిగించేదిగా లేదా కలిగించాల్సిందిగా ఉంది. పాకిస్థాన్‌తో చర్చల నుంచి కాంగ్రెస్ దూరంగా జరిగింది. అంబికాసోనీ వంటి నేతలు బహిరంగంగానే తమ అసమ్మతిని తెలిపారు. కాంగ్రెస్ హిట్‌లిస్ట్‌లో నరేంద్రమోడీ మొట్టమొదటివారైతే, ప్రధాని మన్మోహన్‌ది ఆ తర్వాతి రెండో స్థానం. మన్మోహన్ ఒక విరాగా లేక గాయాల బాధను ప్రేమించే విపరీత మనస్తత్వం గలవారా? ప్రతిపక్షం చేతిలో దండనకు గురికావడం ఇచ్చిపుచ్చుకునే ప్రజాస్వామిక రాజకీయాల్లో భాగం. సొంత పార్టీ సహచరుల నుంచే తిరస్కార అస్త్రాలకు గురి కావడాన్ని అంగీకరించడం సామాన్యం కాదు. అంత తేలికగా అంతుపట్టని స్వభావం అందుకు అవసరం. మన్మోహన్ బహుశా తాను పయనిస్తున్న నావను కల్లోలానికి గురిచేయరాదని భావిస్తుండవచ్చు. కానీ ఆ నావను నడిపే నావికులే దాన్ని పెను తుఫానులోకి నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఇంకా మిగిలి లేదు. మనకు ఉన్నదల్లా అనిశ్చితితో కూడిన వాదోపవాదాల్లో తాము ఎక్కడ నిలిచి ఉన్నారో లేదా ఎక్కడ నిలవాలో ఏ మంత్రికీ ఖచ్చితంగా తెలియని పరిస్థితి మాత్రమే. ఒక సాంకేతికమైన నిర్మాణం మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉంది. కాగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది మార్చిలోగా ఎన్నికల్లో ఘోర పరాజయన్ని నివరించే అద్భుతం ఏదైనా జరగాలని ఇంకా ఆశిస్తూనే ఉంది. అద్భుతాలు జరగాలంటే పరమ పవిత్రులు కావాలి. రాజకీయాల్లో పరమ పవిత్రులు ఉండరు. -
ముజఫర్ నగర్ బాధితులకు మన్మోహన్, సోనియా ఓదార్పు
అల్లర్లతో అట్టుడికి, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. అల్లర్ల బాధితులు తలదాచుకుంటున్న బాసి కలాన్ సహాయక శిబిరాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు.సహాయక శిబిరంలో వారికి అందుతున్న సహయ చర్యల గురించి వాకబు చేశారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైతే కేంద్ర సహాయం చేస్తుందని.. ప్రధాని మన్మోహన్సింగ్ వారికి హామీ ఇచ్చారు. ప్రశాంత వాతావరణం నెలకొనటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలు సహకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన బాధితులు ప్రధానికి తమ వినతి పత్రాలను అందజేశారు. తమపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నేడు ముజఫర్‌నగర్‌లో పర్యటించనున్న అఖిలేష్
ఇటీవల అల్లర్లతో అట్టుడికి, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ముజఫర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఆదివారం పర్యటించనున్నారు. ఆ అల్లర్లలో గాయపడి ముజఫర్‌నగర్‌లోని పలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వందలాది మంది క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ముజఫర్‌నగర్‌లో శాంతి భద్రతలపై ఆ జిల్లా ఉన్నతాధికారులతో అఖిలేష్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ముజఫర్‌నగర్‌లో సోమవారం మన్మోహన్ సింగ్ పర్యటించనున్నారు. ఆయనతోపాటు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పర్యటిస్తారు. ఇటీవల ముజఫర్ నగర్లో హిందువుల్లోని జాట్ తెగకు ముస్లిం మతస్థుల మధ్య చోటు చేసుకున్న చిన్న సంఘటన చినికిచినికి గాలివానగా మారింది.ఆ ఘర్షణలో దాదాపు 48 మంది మరణించగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
బొగ్గు కుంభకోణం ‘అపురూపం’
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్ల గల్లంతుపై ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సోమవారం రాజ్యసభలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జీరోఅవర్‌లో ప్రకాశ్ జవదేకర్(బీజేపీ) బొగ్గు కుంభకోణం ‘అపురూపమైన’దంటూ వ్యంగ్యంగా అభివర్ణించారు. బొగ్గు కేటాయింపుల ఫైళ్లకు తాను కాపలాదారును కాదని ఇటీవల రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన దుయ్యబట్టారు. ప్రధాని ఫైళ్లకే కాదు, దేశానికి కూడా కాపలాదారు వంటివారే. కానీ ఆయన ఈ రెంటిలో ఏ బాధ్యతనూ సక్రమంగా నిర్వర్తిం చడం లేదని జవదేకర్ అన్నారు. దీనిపై ప్రధాని సవివర ప్రకటన చేయాలని పట్టుబట్టారు. -
ఈ దూకుడును పాక్, చైనాలపై చూపండి
నాగపూర్: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రాజ్యసభలో శుక్రవారం ఆవేశంగా ప్రసంగించడంపై శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే స్పందించారు. పాకిస్థాన్, చైనాలు దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొస్తున్నప్పుడు ప్రధాని ఈ దూకుడును ప్రదర్శించరని ఎద్దేవా చేశారు. కానీ ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తారని, ఇదే దూకుడును చైనా, పాక్‌లపై ఎందుకు ప్రదర్శించరోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రామ్‌టెక్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్ధవ్ తనదైన శైలిలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు పార్లమెంటును అడ్డుకోవడంపై ప్రధాని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ నేత అరుణ్ జైట్లీకి, ప్రధానికి మధ్య వాగ్యుద్ధం సాగిన నేపథ్యంలో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ముకుల్ వాస్నిక్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌టెక్ నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించినందున భాగస్వామ్యపక్షాలైన బీజేపీ, ఆర్పీఐలలో ఎవరో ఒకరికి ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఉద్ధవ్ స్పష్టం చేశారు. ఇక సీట్ల పంపకాలపై వస్తున్న వార్తల్లో నిజంలేదని, ఇంకా ఖరారు కావాల్సి ఉందన్నారు. కల్యాణ్ లోక్‌సభ స్థానానికి మనోహర్ జోషి పోటీ చేస్తారని, దాదర్‌ను ఆర్పీఐకి కేటాయిస్తున్నారని, బీజేపీ కూడా శివసేన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తోందంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనన్నారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయమై ఇప్పటిదాకా ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఇక ప్రత్యేక విదర్భ గురించి మాట్లాడుతూ... స్థానిక నేతలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని, ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నారన్నారు. -
బొగ్గు శాఖ ఫైళ్లకు నేను సంరక్షకుడిని కాదు
న్యూఢిల్లీ: బొగ్గు శాఖ ఫైళ్లకు తాను సంరక్షకుడిని కాదని ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. దోషులైన ఏ ఒక్కరినీ ప్రభుత్వం కాపాడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులతో పాటు అనేక అవకతవకలపై బీజేపీ సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ప్రధా ని రాజ్యసభలో సమాధానమిచ్చారు. ‘అవినీతి ఎప్పు డూ ఉంది. అయితే విచారించదగిన ఈ అవినీతి.. సమాచార హక్కు ద్వారా, ప్రభుత్వంలోని వివిధ సంస్థల చురుకైన పాత్ర వల్ల ఇటీవలి కొన్నేళ్లలో బాగా బహిర్గతమైంది’ అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై శుక్రవారం ప్రధాని చేసిన ప్రకటనపై విపక్షాలు వివరణ కోరాయి. మన్మోహన్ వివరణ ఇస్తుండగా అడ్డుతగిలిన సభ్యులు.. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కీలక సమయంలోనే బొగ్గు శాఖ ఫైళ్లు మాయమవుతుంటే అవినీతిని ఎలా అదుపు చేస్తార ని నిలదీశారు. దీనిపై వాడిగా స్పందించిన ప్రధాని బొగ్గు శాఖ ఫైళ్లకు తాను సంరక్షకుడిని కాదన్నారు. మరైతే ఎవరిది బాధ్యత? అని బీజేపీ సభ్యు డు ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించగా,అవినీతి అంశాలను చూసేందుకు కోర్టుల వంటి ఏర్పాట్లు ఉన్నాయని ప్రధాని బదులిచ్చారు. -
ప్రధానిని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
ప్రధానిని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
న్యూఢిల్లీ : పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం మంగళవార ఉందయం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న విభజన నిర్ణయం తర్వాత రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై వారు ఈ సందర్భంగా ప్రధానికి మెమొరాండం సమర్పించారు. 57ఏళ్లుగా కలిసున్న రాష్ట్రాన్ని ఒక్క నిర్ణయంతో విభజన దిశగా నెడుతున్నారని ప్రధానికి ఇచ్చిన మూడు పేజీల లేఖలో పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 11గంటల సమయంలో ప్రధాని నివాసానికి వెళ్లిన ఈ బృందంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, మైసూరారెడ్డి, బాలినేని, కొడాలి నాని, బాబూరావు తదితరులు ఉన్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా పార్టీ ప్రతినిధి బృందం కలవనుంది. -
'తెలంగాణ' ఏర్పాటు సరైన చర్య కాదు: ప్రమోద్ బోరా
తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు సరైన చర్య కాదని అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్యు) అధ్యక్షుడు ప్రమోద్ బోరా మంగళవారం రాటలో జరిగిన విలేకర్ల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఓ విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలు కలసి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఏబీఎస్యు ఇచ్చిన 15 వందల గంటల బంద్ నిరాటంకంగా సాగుతోంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలం అంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దాంతో దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్న వివిధ సంస్థలకు ఊపిరిలూదినట్లు అయింది. అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రాంతాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులకుపైగా నిత్య నిరసనలు, తీవ్ర ఆందోళనలతో అసోం రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజ జీవనం అస్తవ్యస్తమైంది. కార్బి అంగ్లాంగ్ జిల్లాను ప్రత్యేక రాష్టంగా ఏర్పాటు చేయాలని రెండు సంఘాలు 64 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలోని అన్నిపార్టీల నేతలు యూపీఏ చైర్మన్ సోనియాగాందీ, ప్రధాని మన్మోహన్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసేందుకు న్యూఢిల్లీ పయనమైయ్యారు. అయితే జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా అంత సవ్యంగానే ఉందని కార్బి అంగలాంగ్ జిల్లా అధికారులు తెలిపారు. దాంతో ఆరుగంటలపాటు కర్ఫ్యూ ను సడలించినట్లు చెప్పారు. జిల్లాలోని మంజలో పారెస్ట్ కార్యాలయన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను భద్రత దళాలు అరెస్ చేసినట్లు చెప్పారు. బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూడీపీఎఫ్ సోమవారం పిలుపు నిచ్చింది. దాంతో దిగువ అసోంలోని అయిదు జిల్లాలు పూర్తిగా ప్రజాసేవలు నిలిచిపోయాయి. దాంతో జనాలు ఇళ్లకే పరిమితమైనారు. అయితే ఈద్ పండగ నేపథ్యంలో బంద్ పాక్షికంగా నిర్వహించాలిన 60 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీఎస్‌యూ నిర్ణయించింది. అలాగే 11 రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే వెల్లడించింది. అలాగే రాజధాని, సరయిగాట్,కామరుప్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు బ్రహ్మపుత్ర మెయిల్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
ప్రధానికి జయలలిత లేఖ
తమ రాష్ట్ర డీజీపీ కె రామానుజానికి జరిగిన అవమానంపై ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ సంధించారు. ఎస్పీజీ సిబ్బంది తమ డీజీపీని అడ్డుకోవడాన్ని ఆమె బట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రధాని రాసిన లేఖలో జయలలిత కోరారు. పుదుకోట్టై జిల్లా తిరుమయంలో భెల్ అనుబంధ పైపుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవ నిమిత్తం తమిళనాడుకు వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసేందుకు వెళ్లిన రామానుజాన్ని ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. పాస్ లేదనే కారణంతో ఆయనను అడ్డగించారు. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనకు ఆయన దూరంగా ఉండిపోయారు. డీజీపీకి అవమానం ఎదురు కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రధాన అధికారిని అవమానపరిచే రీతిలో ఎస్పీజీ వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రొటోకాల్ అధికారి అనుజార్జ్ను వివరణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదికను జార్జ్‌ను కోరడం విశేషం.