ప్రధానిపై అనంతపురంలో కేసు | Case Against Manmohan Singh, Sonia Gandhi in Anantapur Court | Sakshi
Sakshi News home page

ప్రధానిపై అనంతపురంలో కేసు

Published Tue, Jan 7 2014 1:13 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ప్రధానిపై అనంతపురంలో కేసు - Sakshi

ప్రధానిపై అనంతపురంలో కేసు

అనంతపురం: ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీపై అనంతపురం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలయింది. న్యాయవాదులు మల్లికార్జున, నాగన్న ఈ కేసు దాఖలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. దీనికి  ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ బాధ్యులని వారు ఆరోపించారు.

రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని పిటిషన్లో న్యాయవాదులు కోరారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని పలు పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement