బొగ్గు శాఖ ఫైళ్లకు తాను సంరక్షకుడిని కాదని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. దోషులైన ఏ ఒక్కరినీ ప్రభుత్వం కాపాడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: బొగ్గు శాఖ ఫైళ్లకు తాను సంరక్షకుడిని కాదని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. దోషులైన ఏ ఒక్కరినీ ప్రభుత్వం కాపాడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులతో పాటు అనేక అవకతవకలపై బీజేపీ సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ప్రధా ని రాజ్యసభలో సమాధానమిచ్చారు. ‘అవినీతి ఎప్పు డూ ఉంది. అయితే విచారించదగిన ఈ అవినీతి.. సమాచార హక్కు ద్వారా, ప్రభుత్వంలోని వివిధ సంస్థల చురుకైన పాత్ర వల్ల ఇటీవలి కొన్నేళ్లలో బాగా బహిర్గతమైంది’ అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై శుక్రవారం ప్రధాని చేసిన ప్రకటనపై విపక్షాలు వివరణ కోరాయి.
మన్మోహన్ వివరణ ఇస్తుండగా అడ్డుతగిలిన సభ్యులు.. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కీలక సమయంలోనే బొగ్గు శాఖ ఫైళ్లు మాయమవుతుంటే అవినీతిని ఎలా అదుపు చేస్తార ని నిలదీశారు. దీనిపై వాడిగా స్పందించిన ప్రధాని బొగ్గు శాఖ ఫైళ్లకు తాను సంరక్షకుడిని కాదన్నారు. మరైతే ఎవరిది బాధ్యత? అని బీజేపీ సభ్యు డు ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించగా,అవినీతి అంశాలను చూసేందుకు కోర్టుల వంటి ఏర్పాట్లు ఉన్నాయని ప్రధాని బదులిచ్చారు.