Coal Ministry
-
బొగ్గు గనుల కోసం పోటా పోటీ
న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలానికి భారీ స్పందన కనిపించింది. ఏడో విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 103 బ్లాకులను ఆఫర్ చేసింది. 18 బొగ్గు గనులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ కలసి 35 బిడ్లు దాఖలైనట్టు బొగ్గు శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి టెక్నికల్ బిడ్లను బుధవారం తెరిచారు. ఎన్టీపీసీ, ఎన్ఎల్సీ ఇండియా, జేఎస్పీఎల్ తదితర 22 కంపెనీలు వేలంలో పోటీ పడుతున్నాయి. 18 బొగ్గు గనుల్లో 9 పాక్షికంగా బొగ్గు అన్వేషించినవి. మిగిలిన గనుల్లో అన్వేషణ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించారు. వీటి ద్వారా ఏటా 51.80 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయవచ్చు. 17 నాన్ కోకింగ్ కోల్ కాగా, ఒకటి కోకింగ్ కోల్‌మైన్. జేఎస్పీఎల్, ఎన్ఎల్సీ ఇండియా, బజ్రంగ్ పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జీఎండీసీ), బుల్ మైనింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఒక్కోటీ మూడు బ్లాకులకు బిడ్లు వేశాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ మైనింగ్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ ఒక్కోటీ రెండు కోల్ బ్లాక్‌ల కోసం పోటీ పడుతున్నాయి. నల్వా స్టీల్ అండ్ పవర్, నువోకో విస్టాస్ కార్ప్, ఒడిశా కోల్ అండ్ పవర్ తదితర 14 కంపెనీలు ఒక్కో బ్లాక్ కోసం బిడ్లు దాఖలు చేశాయి. -
గుడ్‌న్యూస్: మెరుగుపడ్డ బొగ్గు ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు ఉత్పత్తి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం పెరిగి 777 మిలియన్ టన్నులుగా (ఎంటీ) ఉన్నట్టు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వేసవి ఎండల నేపథ్యంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడం గమనార్హం. దీంతో బొగ్గు నిల్వల కొరతపై వార్తలు వస్తున్న క్రమంలో మంత్రి చేసిన ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది. 2020–21 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 716 మిలియన్ టన్నులుగా ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు. బొగ్గు సరఫరా 18 శాతం పెరిగి 818 మిలియన్ టన్నులుగా నమోదైంది. బొగ్గు గనుల్లో భద్రతకు సంబంధించి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. బొగ్గు గనుల్లో భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. భద్రతా చర్యల అమలు విషయంలో నిధుల కొరత రాకుండా చూసుకోవాలని కోరారు. గతేడాది అక్టోబర్‌లోనూ బొగ్గు నిల్వలు తగ్గిపోవడం తెలిసిందే. చదవండి: అక్టోబర్ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ -
వైజాగ్ స్టీల్‌కు కోల్ బ్లాక్‌లు కేటాయించండి
బొగ్గు శాఖను కోరిన ఉక్కు శాఖ న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం అవసరమయ్యే థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్‌లను కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను ఉక్కు మంత్రిత్వశాఖ కోరింది. రాష్ట్రీయ ఇస్పాత నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్-వైజాగ్ స్టీల్) తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు పెంచుకుంది. అధునికీకరణ, యూనిట్ల అప్‌గ్రెడేషన్‌తో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7.3 మి. టన్నులకు పెంచుకోవాలని యోచి స్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నులకు పెంచుకునే ప్రయత్నాలను కూడా ఈ కంపెనీ చేస్తోంది. ఉత్పత్తి సామర్త్యం పెంపు కోసంవ థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్‌లను నేరుగా కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను వైజాగ్ స్టీల్ కోరింది. నవరత్న హోదా ఉన్న ఆర్ఐఎన్ఎల్కు ఇప్పటిదాకా సొంత ఇనుము, బొగ్గు వనరులు లేవు. -
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎన్టీయూసీ ఆర్జీ-1 ఉపాధ్యక్షులు నాయిని మల్లేశ్ డిమాండ్ చేశారు. జీడీకే-2వ గని కార్మికులను శుక్రవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, సకలజనుల సమ్మె వేతనాలు, సొంత ఇంటి కల తదితర డిమాండ్లపై ఈనెల 7న ఐదు జాతీయ సంఘాలు సమావేశమయ్యాయని తెలిపారు. మరొకసారి ఈనెల 13న కలిసివచ్చే సంఘాలతో సమావేశమై సమస్యలపై యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు 15వ తేదీన సింగరేణి సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈనెల 15న రాష్ట్రానికి వస్తున్న బొగ్గుశాఖ మంత్రిని కలిసి పదో వేజ్బోర్డుపై, ఇతర విషయాలపై వినతిపత్రం అందజేస్తారని పేర్కొన్నారు. జీడీకే-2వ గనిలో 190/240 మస్టర్లు నిండిన బదిలీవర్కర్లను పైక్యేటగిరీలో పనిచేయించుకుంటూ తదనుగుణంగా వేతనం ఇవ్వకుండా యాజమాన్యం వేధిసోందని తెలిపారు. వెంటనే వారికి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.సదానందం, మున్నూరు రాజన్న, జి.శ్రీనివాస్, దుర్గయ్య, నర్సయ్య, ఓదెలు, సాంబయ్య, గడ్డం కృష్ణ, ఆకుల రవీందర్, ఎన్.సాగర్, ఎల్.ఆంజనేయులు, రమేశ్, ముడుసు రమేశ్, వేటు కనకయ్య, అడివి మల్లయ్య, కొండ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి సమస్యలపై ఉమ్మడి ఆందోళనలు
► సన్నద్ధమవుతున్న జాతీయ కార్మిక సంఘాలు ► కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసే పనిలో నాయకులు గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు 10వ వేజ్‌బోర్డు కమిటీని సత్వరమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సం ఘాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగం గా ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన సంఘాలు తిరిగి 13న శ్రీరాంపూర్‌లో సమావేశం కావడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఆ రోజు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందు కు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికులకు సంబంధించిన 10వ వేతన ఒప్పందం ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉంది. ఇందుకు జాయింట్ బైపార్టియేటెడ్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) కమిటీ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటి వరకు మొదలు కాలేదు. జేబీసీసీఐ కమిటీని కోలిండియా లిమిటెడ్(సీఐఎల్) సంస్థ ఏర్పాటు చేయాలా? లేక కేంద్ర బొగ్గు శాఖ ఏర్పాటు చేయాలా ? అనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా కోలిండియా సంస్థ కమిటీ ఏర్పాటు చేస్తే సింగరేణి ని మినహాయించి తన పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలతో కమిటీ వేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ పరిణామం సింగరేణిలో ఉన్న జాతీయ సంఘాలను ఆందోళనకు గురిచేసింది. దీంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను స్వయంగా కలిసి విన్నవించాలనే నిర్ణయానికి జాతీయ సం ఘాలు వచ్చాయి. ఈనెల 15న కేంద్ర మంత్రి వస్తారనే సమాచారం మేరకు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ నాయకులు ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశానికి మరో జాతీయ కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్ హాజరు కాలేదు. ఈ సంఘం విడిగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి పలు సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ బొగ్గు శాఖ మంత్రిని కలిపించాలని కోరుతూ గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హంసరాజ్ గంగారామ్‌కు ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపించారు. సీఎండీని కలువనున్న సంఘాలు సింగరేణిలో నెలకొన్న వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, సకల జనుల సమ్మె కాలపు వేతనం చెల్లింపు, సొంతిం టి పథకం, డిస్మిస్డ్ కార్మికులు, వీఆర్ఎస్ వారసులకు ఉద్యోగావకాశం తదితర సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌ను కలిసి విన్నవించేందుకు జాతీయ కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. అయితే జూన్ 7న హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి హెచ్ఎంఎస్, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు హాజరు కానందున వారిని మరోసారి ఆహ్వానిస్తూ ఈనెల 13న శ్రీరాంపూర్‌లో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాలకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వైపు కోలిండియా నుంచి సింగరే ణిని తప్పించాలని తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం లేఖలు రాసిందని, ఇందుకు గుర్తింపు సంఘానిదే బాధ్యత అంటూ ప్రచారం చేసిన జాతీయ కార్మిక సంఘాలు తిరిగి ఉమ్మడి ఆందోళనలపై నిర్ణయం తీసుకునే సమావేశాలకు టీబీజీకేఎస్‌ను ఆహ్వానించారు. దీనిపై ఆ యూనియన్ ఆచి తూచి అడుగులు వేస్తుస్తోంది. -
రూ. 233 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వండి
న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లోని బొగ్గు గని అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా రూ. 233 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీని కేంద్రం ఆదేశించింది. ష్యూరిటీ ఇవ్వని పక్షంలో గని కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుందని సంస్థ సీఎండీ అరూప్ రాయ్ చౌదరికి పంపిన నోట్లో బొగ్గు శాఖ హెచ్చరించింది. లారా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గును ఉత్పత్తి చేసుకునేందుకు 2006 జనవరిలో మాండ్ రాయగఢ్ ప్రాంతంలోని తలైపల్లి బ్లాకును కేంద్రం ఎన్టీపీసీకి కేటాయించింది. దీనిపై ఇప్పటిదాకా ఎన్టీపీసీ సుమారు రూ. 1,464.5 కోట్లు వెచ్చించింది. ఇది 2011 ఫిబ్రవరిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థలం కేటాయింపులు జరగకపోవడం, రెండో దశ అటవీ శాఖ క్లియరెన్స్ లభించకపోవడం తదితర కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ప్రైవేట్, పబ్లిక్ సంస్థలకు ఇచ్చిన బొగ్గు బ్లాకుల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన అంతర్ మంత్రిత్వ బృందం (ఐఎంజీ).. ఎన్టీపీసీ నుంచి ష్యూరిటీ తీసుకోవాలని సూచించింది. -
సీబీఐకి అందని 150 బొగ్గు ఫైళ్లు
న్యూఢిల్లీ: గల్లంతైన 150 బొగ్గు స్కాం ఫైళ్లు, పత్రాలు సీబీఐకి ఇంకా అందలేదు. దీంతో ఈ వ్యవహారంపై కేసు పెట్టేందుకు ఆ సంస్థ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇవ్వాల్సిన ఫిర్యాదు కోసం ఎదురు చూస్తోంది. బొగ్గు కేటాయింపులకు సంబంధించి పలువురు ఎంపీలు ఇచ్చిన సిఫార్సు లేఖలతో పాటు 150 ఫైళ్లు ఇంకా దొరకలేదని సీబీఐకి తెలిపినట్లు సీనియర్ అధికారులు చెప్పారు. -
బొగ్గు శాఖ ఫైళ్లకు నేను సంరక్షకుడిని కాదు
న్యూఢిల్లీ: బొగ్గు శాఖ ఫైళ్లకు తాను సంరక్షకుడిని కాదని ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. దోషులైన ఏ ఒక్కరినీ ప్రభుత్వం కాపాడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులతో పాటు అనేక అవకతవకలపై బీజేపీ సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ప్రధా ని రాజ్యసభలో సమాధానమిచ్చారు. ‘అవినీతి ఎప్పు డూ ఉంది. అయితే విచారించదగిన ఈ అవినీతి.. సమాచార హక్కు ద్వారా, ప్రభుత్వంలోని వివిధ సంస్థల చురుకైన పాత్ర వల్ల ఇటీవలి కొన్నేళ్లలో బాగా బహిర్గతమైంది’ అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై శుక్రవారం ప్రధాని చేసిన ప్రకటనపై విపక్షాలు వివరణ కోరాయి. మన్మోహన్ వివరణ ఇస్తుండగా అడ్డుతగిలిన సభ్యులు.. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కీలక సమయంలోనే బొగ్గు శాఖ ఫైళ్లు మాయమవుతుంటే అవినీతిని ఎలా అదుపు చేస్తార ని నిలదీశారు. దీనిపై వాడిగా స్పందించిన ప్రధాని బొగ్గు శాఖ ఫైళ్లకు తాను సంరక్షకుడిని కాదన్నారు. మరైతే ఎవరిది బాధ్యత? అని బీజేపీ సభ్యు డు ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించగా,అవినీతి అంశాలను చూసేందుకు కోర్టుల వంటి ఏర్పాట్లు ఉన్నాయని ప్రధాని బదులిచ్చారు.