సింగరేణి సమస్యలపై ఉమ్మడి ఆందోళనలు | Singareni issues of common concerns | Sakshi
Sakshi News home page

సింగరేణి సమస్యలపై ఉమ్మడి ఆందోళనలు

Published Fri, Jun 10 2016 1:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Singareni issues of common concerns

సన్నద్ధమవుతున్న జాతీయ కార్మిక సంఘాలు
కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసే పనిలో నాయకులు

 
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు 10వ వేజ్‌బోర్డు కమిటీని సత్వరమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సం ఘాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగం గా ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన సంఘాలు తిరిగి 13న శ్రీరాంపూర్‌లో సమావేశం కావడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఆ రోజు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందు కు సిద్ధమవుతున్నాయి.


ముఖ్యంగా దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికులకు సంబంధించిన 10వ వేతన ఒప్పందం ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉంది. ఇందుకు జాయింట్ బైపార్టియేటెడ్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) కమిటీ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటి వరకు మొదలు కాలేదు. జేబీసీసీఐ కమిటీని కోలిండియా లిమిటెడ్(సీఐఎల్) సంస్థ ఏర్పాటు చేయాలా? లేక కేంద్ర బొగ్గు శాఖ ఏర్పాటు చేయాలా ? అనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా కోలిండియా సంస్థ కమిటీ ఏర్పాటు చేస్తే సింగరేణి ని మినహాయించి తన పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలతో కమిటీ వేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.

ఈ పరిణామం సింగరేణిలో ఉన్న జాతీయ సంఘాలను ఆందోళనకు గురిచేసింది. దీంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను స్వయంగా కలిసి విన్నవించాలనే నిర్ణయానికి జాతీయ సం ఘాలు వచ్చాయి. ఈనెల 15న కేంద్ర మంత్రి వస్తారనే సమాచారం మేరకు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ నాయకులు ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశానికి మరో జాతీయ కార్మిక సంఘమైన హెచ్‌ఎంఎస్ హాజరు కాలేదు. ఈ సంఘం విడిగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి పలు సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ బొగ్గు శాఖ మంత్రిని కలిపించాలని కోరుతూ గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హంసరాజ్ గంగారామ్‌కు ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపించారు.
 
 సీఎండీని కలువనున్న సంఘాలు
 సింగరేణిలో నెలకొన్న వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, సకల జనుల సమ్మె కాలపు వేతనం చెల్లింపు, సొంతిం టి పథకం, డిస్మిస్డ్ కార్మికులు, వీఆర్‌ఎస్ వారసులకు ఉద్యోగావకాశం తదితర సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌ను కలిసి విన్నవించేందుకు జాతీయ కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. అయితే జూన్ 7న హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి హెచ్‌ఎంఎస్, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు హాజరు కానందున వారిని మరోసారి ఆహ్వానిస్తూ ఈనెల 13న శ్రీరాంపూర్‌లో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాలకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఒక వైపు కోలిండియా నుంచి సింగరే ణిని తప్పించాలని తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం లేఖలు రాసిందని, ఇందుకు గుర్తింపు సంఘానిదే బాధ్యత అంటూ ప్రచారం చేసిన జాతీయ కార్మిక సంఘాలు తిరిగి ఉమ్మడి ఆందోళనలపై నిర్ణయం తీసుకునే సమావేశాలకు టీబీజీకేఎస్‌ను ఆహ్వానించారు. దీనిపై ఆ యూనియన్ ఆచి తూచి అడుగులు వేస్తుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement