సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎన్‌టీయూసీ ఆర్జీ-1 ఉపాధ్యక్షులు నాయిని మల్లేశ్ డిమాండ్ చేశారు. జీడీకే-2వ గని కార్మికులను శుక్రవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, సకలజనుల సమ్మె వేతనాలు, సొంత ఇంటి కల తదితర డిమాండ్లపై ఈనెల 7న ఐదు జాతీయ సంఘాలు సమావేశమయ్యాయని తెలిపారు. మరొకసారి ఈనెల 13న కలిసివచ్చే సంఘాలతో సమావేశమై సమస్యలపై యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు 15వ తేదీన సింగరేణి సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈనెల 15న రాష్ట్రానికి వస్తున్న బొగ్గుశాఖ మంత్రిని కలిసి పదో వేజ్‌బోర్డుపై, ఇతర విషయాలపై వినతిపత్రం అందజేస్తారని పేర్కొన్నారు.
జీడీకే-2వ గనిలో 190/240 మస్టర్లు నిండిన బదిలీవర్కర్లను పైక్యేటగిరీలో పనిచేయించుకుంటూ తదనుగుణంగా వేతనం ఇవ్వకుండా యాజమాన్యం వేధిసోందని తెలిపారు. వెంటనే వారికి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.సదానందం, మున్నూరు రాజన్న, జి.శ్రీనివాస్, దుర్గయ్య, నర్సయ్య, ఓదెలు, సాంబయ్య, గడ్డం కృష్ణ, ఆకుల రవీందర్, ఎన్.సాగర్, ఎల్.ఆంజనేయులు, రమేశ్, ముడుసు రమేశ్, వేటు కనకయ్య, అడివి మల్లయ్య, కొండ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.