పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం మంగళవార ఉందయం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న విభజన నిర్ణయం తర్వాత రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై వారు ఈ సందర్భంగా ప్రధానికి మెమొరాండం సమర్పించారు. 57ఏళ్లుగా కలిసున్న రాష్ట్రాన్ని ఒక్క నిర్ణయంతో విభజన దిశగా నెడుతున్నారని ప్రధానికి ఇచ్చిన మూడు పేజీల లేఖలో పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 11గంటల సమయంలో ప్రధాని నివాసానికి వెళ్లిన ఈ బృందంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, మైసూరారెడ్డి, బాలినేని, కొడాలి నాని, బాబూరావు తదితరులు ఉన్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా పార్టీ ప్రతినిధి బృందం కలవనుంది.
Published Tue, Aug 27 2013 12:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement