అత్తెసరు మార్కుల అమాత్యులు | Narendra Modi rule in the first year, every Indian nirdi stamaina opinion about this taranam looked | Sakshi
Sakshi News home page

అత్తెసరు మార్కుల అమాత్యులు

Published Sat, May 30 2015 12:23 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అత్తెసరు మార్కుల అమాత్యులు - Sakshi

అత్తెసరు మార్కుల అమాత్యులు

వచ్చిన చిక్కేమిటంటే, పెట్రోలియం శాఖలో అవినీతిని నిర్మూలించడానికి ....

జాతిహితం
 
వచ్చిన చిక్కేమిటంటే, పెట్రోలియం శాఖలో అవినీతిని నిర్మూలించడానికి ఆయన అనుసరిస్తున్న వైఖరి, సరిగ్గా యూపీఏలో రక్షణ శాఖలో అవినీతిని నిరోధించడానికి ఏకే ఆంటోనీ అనుసరించిన పద్ధతిలాగే ఉంది. తన చుట్టూ గిరిగీసుకున్నారు, ఇప్పటికీ ఏమీ చేయలేదు. కాబట్టి ఎక్కడా తప్పు జరగదు. కొత్త పెట్టుబడులు, షేల్ గ్యాస్, కొత్త తవ్వకాలు అంతా ఆంటోనీ వ్యవహారమే.
 
నరేంద్ర మోదీ తొలి సంవత్సరం పాలన గురించి ప్రతి భారతీయుడు నిర్ది ష్టమైన అభిప్రాయం ఏర్పరచుకున్నట్టు కనిపిస్తున్న ఈ తరణంలో, ఆయన మంత్రిమండలి సభ్యుల మీదకు దృష్టి మరల్చి, అత్తెసరు మార్కుల ఊసులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నందుకు నన్ను మన్నించాలి. ఎందుకంటే, అతడి పేరు మాహి కావచ్చు లేదా మోదీ కావచ్చు, తన బృందం మాదిరిగానే కెప్టెన్ కూడా అంతిమంగా ఉత్తముడే అయి ఉంటాడు. నా పనిని తక్కువ సంక్లిష్టం చేసుకోవడానికి 66 మంది శక్తిమంతులైన మంత్రులతో కూడిన మోదీ మంత్రి వర్గంలో 10 మందికి రేటింగ్ ఇవ్వడానికే పరిమితమవుతున్నాను. వీరు చాలా ముఖ్యమైనవారు, జనం దృష్టిలో ఉండేవారు, వార్తా స్రష్టలు కూడా. ఈ పదు గురిలో ప్రతి వారు తమ తమ స్థాయిలో నిజమైన టాప్ టెన్‌లో ఒకరే. వారు నిర్వహించిన మంత్రిత్వశాఖల లక్షణం, ప్రాధాన్యం; పార్టీలో వారికున్న సీని యారిటీ ముఖ్యమే గానీ, అయితే అవే రేటింగ్ ఇవ్వడానికి అనివార్యంగా తీసుకోవలసిన నిర్దిష్టమైన కారణాలు మాత్రం కాదు. కాబట్టి మనకి చాలా తక్కువగా మాత్రమే తెలిసిన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం-ఆరోగ్య మం త్రిత్వశాఖలనీ, బీరేందర్‌సింగ్, రాధామోహన్ సింగ్, జేపీ నడ్డా వంటివారిని గురించి అంచనా వేయడం లేదు. మళ్లీ ఒక్కసారి, మనం పది మందినే (వీరితో పాటు గౌరవం పంచుకుంటున్న వారితో కలిపి నిజానికి 12 మంది) ఎంచుకున్న కారణంగా వీరి రేటింగ్‌ను ఆరోహణక్రమంలో 1 నుంచి 10 వరకు చూడాలి.

1. మానవవనరుల అభివృద్ధి, స్మృతీ ఇరానీ: దాదాపు రెండు దశాబ్దాలుగా అమలువుతున్న 57 ఏళ్ల సగటు వయసు అనే నిబంధనకు అతీతంగా మంత్రిమండలిలో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు. మీడియాకు సన్నిహితురాలిగా మెలగుతారు. చక్కగా మాట్లాడతారు. నేటి భారతీయ యువత, రాబోయే యువతరం జనాభా కూడా లాభసాటి అయినదే గానీ, విపత్తు కాదని చాటే ప్రధాన బాధ్యతను మోస్తున్న మంత్రిత్వ శాఖకు ఆమె సరైన వ్యక్తి. ఆమె 12 మాసాల పాలనలో చాలా విజయాలు ఉన్నాయి. అధికారికంగా ఉండాల్సిన విద్యార్హత లేదన్న కారణంగానూ, హోలీ యేల్ సంస్థ ఇచ్చిన పట్టాను అగౌరవ పరచడానికీతనను లక్ష్యంగా చేసుకొని జరిగిన ప్రయత్నాలను ఆమె పటాపంచలు చేశారు. అయితే, ప్రధాని తరు వాత మంత్రిమండలిలో హిందీలోగానీ, ఇంగ్లిష్‌లోగానీ అనర్గళంగా మాట్లాడ గలిగిన రెండో మంత్రి ఆమేనని తేలడానికి ఈ ఉదంతం ఉపకరించింది. ఢిల్లీకి ఉత్తరాన ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ దినేశ్‌సింగ్, దక్షిణాన ఐఐటీ డెరైక్టర్ ఆర్‌కే షేవగాంకర్ కూడా స్మృతీ ఇరానీ విజయాలలో భాగమే. కానీ, దురదృష్టవశాత్తు ఢిల్లీకి తూర్పుపడమరలలో ఇలాంటి జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థలేవీ మనకు లేవు. ఐఐటీ అధిపతుల ఎంపిక పద్ధతిని ఆమె మార్చేశారని ప్రముఖ అణు శాస్త్రవేత్త, ముంబై ఐఐటీ చైర్మన్ అనిల్ కాకొద్కర్ హుందాగా సూచించారు. ఎన్‌సీఈఆర్‌టీ అధిపతి వెళ్లిపోయారు. ఇంకొందరూ ఆయన బాటపట్టవచ్చు. హెచ్‌ఆర్‌డీ శాఖను వివాదం చేసే పనిని కొనసాగిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఆ రకంగా చూస్తే వివాదాలను కొనసాగిస్తూ ఆమె ఎన్డీయే పాలిట జైరాం రమేశ్ కావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.

2. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన, ఉమా భారతి: మంత్రిగా ఆమె చేసిందేమీ లేదు. అయినా స్మృతీ ఇరానీ కంటె రెండు స్థానాల పైన రేటింగ్‌కు అర్హురాలవుతారు. ఇందుకు పెద్ద కారణమేమీ లేదు. ఆమె వాస్తవంగా ఎలాంటి చేటూ చేయలేదు. కొత్త వివాదాలూ లేవదీయనూలేదు. నిజానికి కుర్రకారు పాత హిందీ సినిమాలలో మాదిరిగా తడిసీ తడియనట్టు ఉండే బట్టలతో గంగా ప్రవాహంలో కౌగిలించుకోవడం, కిందికి వెళ్లే ప్రవా హాన్ని మోదుతూ అరుచుకోవడం వంటి అసభ్య కార్యకలాపాలకు పాల్పడ కుండా నిషేధించాలంటూ వీహెచ్‌పీ తాజాగా ఇచ్చిన పిలుపునకు ఆమె స్పం దించకుండా సంయమనం పాటించడం హర్షించదగినదే. అందుకైనా ఆమె కచ్చితంగా పదిలో రెండో స్థానం పొందుతారు.

3.మైనారిటీ వ్యవహారాలు, నజ్మా హెప్తుల్లా: మనకున్న ప్రముఖులలో చాలా అనుభవం కలిగి ఉన్నప్పటికీ, ఇటీవలి కాషాయంబధారి అయిన నజ్మా, ప్రస్తుత మంత్రి మండలిలో ఉన్న నలుగురు లేదా ఐదుగురు (మైనారి టీలను మీరు ఎలా నిర్వచిస్తారు అనే అంశం మీద ఇది ఆధారపడి ఉంది) మైనారిటీలలో ఒకరైన ఆమె మంత్రిత్వశాఖను ఒకటి కంటే ఎక్కువ మార్గాల లోనే మానవీకరిస్తున్నారు. ఇంత తక్కువ మంది మైనారిటీలు ఇంతకు ముం దు ఏ మంత్రివర్గంలోనూ లేరు. ఆమె చేసినది కూడా చాలా తక్కువ. మన పాత ప్రపంచంలోని పాఠశాలల్లో మాదిరిగా అత్తెసరు మార్కులు తెచ్చుకు న్నారు. ఇందుకు కారణం ఏమిటంటే, ఆమె వార్తల్లో కనిపించడం లేదు. మైనారిటీల కోసం మాట్లాడలేదు. అలా అని, బుజ్జగింపు ధోరణిలా కనిపించే హజ్ రాయితీ, మదర్సాల కంప్యూటరీకరణ వంటి అంశాలను ఉపసంహ రించలేదు.

4. పెట్రోలు, సహజవాయువు (సహాయ మంత్రి, ఇండిపెండెంట్ చార్జి), ధర్మేంద్ర ప్రధాన్: గడచిన రెండు దశాబ్దాలుగా మన మంత్రిత్వశాఖలలో అత్యంత వివాదాస్పదంగా ఉన్న ఈ శాఖను బట్టి, సాపేక్షంగా చూస్తే ఆయన అంత ప్రముఖుడని అనిపించడు. ప్రతిష్ట, అవినీతి రహితునిగా ఉన్న పేరు, విశ్వాస పాత్రతలను బట్టి యూపీఏ హయాంలో వీరప్ప మొయిలీ, జైపాల్ రెడ్డి, మురళీదేవ్‌రా, మణిశంకర్ అయ్యర్ (వరసక్రమంలో వెనక నుంచి) వంటి వారు నిర్వహించిన ఈ శాఖను ప్రధాన్‌కు అప్పగించారు. ఆయన తన ప్రధాని పెట్టుకున్న ఆశలను పూర్తిగా నెరవేర్చగలిగారు. ఆయన మంత్రిత్వ శాఖ మీద పట్టు సాధించిన కార్పొరేట్ లాబీలను, దళారులను చెల్లాచెదురు చేశారు. కార్పొరేట్ గూఢచర్యం ఆరోపణతో వారిలో కొందరు క్రిమినల్ కేసు లను కూడా ఎదుర్కొంటున్నారు. చమురు ధరలకు సంబంధించి యూపీఏ ప్రవేశపెట్టిన విధానాన్ని కొనసాగించడంలో కూడా ప్రధాన్ తన ప్రధానికి యథోచితంగా సహకరించారు. మోదీ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజ యాలలో ఒకటైన ఎల్‌పీజీని ప్రత్యక్ష ప్రయోజన బదలీ పరిధిలోకి చేర్చడంలో కూడా ఆయన తనవంతు సాయం చేశారు.  కానీ వచ్చిన చిక్కేమిటంటే, పెట్రోలియం శాఖలో అవినీతిని నిరోధిం చడానికి ఆయన అనుసరిస్తున్న వైఖరి, సరిగ్గా యూపీఏలో రక్షణ శాఖలో అవి నీతిని నిరోధించడానికి ఏకే ఆంటోనీ అనుసరించిన పద్ధతిలాగే ఉంది. తన చుట్టూ గిరిగీసుకున్నారు, ఇప్పటికీ ఏమీ చేయలేదు. కాబట్టి ఎక్కడా తప్పు జరగదు. కొత్త పెట్టుబడులు, షేల్ గ్యాస్, కొత్త తవ్వకాలు అంతా ఆంటోనీ వ్యవహారమే.

5. హోం, రాజ్‌నాథ్ సింగ్; రవాణా, జాతీయ రహదారులు, నౌకా యానం, నితిన్ గడ్కరీ: రాజ్‌నాథ్‌సింగ్ చాలావరకు పత్రికల వారికి దూరంగా ఉంటున్నారు. అయితే మహారాణా ప్రతాప్ వర్సెస్ అక్బర్‌కు సంబంధించిన చరిత్ర గురించి ఆయన అభిప్రాయంతో మనకు పనిలేదు. అయితే గట్టి రాజ కీయ ప్రాధాన్యం ఉన్న మంత్రిత్వశాఖలలో ఒకటైన హోంశాఖకు ఆయన నాయకత్వం ప్రతిభావంతంగానే ఉంది. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ సంకీర్ణం విజయవంతంగా సాగడాన్ని బట్టి ఇప్పటికి ఆయన పాస్ మార్కులు సంపాదించుకున్నట్టే. ఆయన తరువాత ఎదుర్కొనే పరీక్ష, ఢిల్లీ. గడ్కరీ, ఎన్డీయే ప్రభుత్వానికి ఎంతో ప్రీతిపాత్రమైన, ఆమోదయోగ్య మైన ఈ కమ్యూనికేటర్, రోజు ఒక్కంటికి జరుగుతున్న రోడ్డు నిర్మాణం గురించి అతిశయోక్తులు వల్లించకుండా నిభాయించుకుని ఉంటే, అంతకంటే మంచిమార్కులు తెచ్చుకునేవారు. నిజానికి జాతీయ రహదారుల పథకాన్ని యూపీఏ కుక్కలు చింపిన విస్తరి చేసింది. దానిని కాస్త దారిలో పెట్టాలని ఎవరు భావించినా కనీసం సంవత్సరం పడుతుంది. చాలా మంది కాంట్రా క్టర్లు దివాలా తీశారు. లేదా పత్తా లేకుండాపోయారు. భూమి సేకరణ లేక పోవడం, ఇంకా మట్టి, ఇటుకలు వంటివాటిని యూపీఏ ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకోవడం ఇందుకు కారణాలుగా చూపుతున్నారు. మొదట గడ్కరీ తన ఇబ్బంది గురించి ఇంకాస్త బాగా వివరించగలిగే స్థితిలో ఉండాలి.

6. విద్యుత్, బొగ్గు (సహాయ మంత్రి, ఇండిపెండెంట్ చార్జి), పీయూష్ గోయెల్: బొగ్గు రంగంలో ఉన్న విధానపరమైన గందరగోళాన్ని తొలగించే పనిని చక్కగా నిర్వహించిన ఈ యువమంత్రికి ప్రథమశ్రేణి లభిస్తుంది. ప్రధాని ప్రతిష్టాత్మకంగా భావించే పధకాలలో ఒకటైన సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో ఆయన చూపిన ప్రతిభ కూడా యువమంత్రికి ప్రతిష్టను తెచ్చిపెట్టేదే. అయితే, ‘మితిమీరిన’ విద్యుత్, (గ్రిడ్‌లో చాలా ఉంది. కానీ ఎవరూ కొనుగోలు చేయాలని అనుకోవడం లేదు) ‘అతి కోతలు’ అన్న పరిహాసపూరిత ఆభాసలో ఎందుకు నేటికీ భారత్ తరుచూ చిక్కుకుంటోంది? అందుకు కారణం, దేశంలో విద్యుత్ ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తమైనాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న- బొగ్గుగనుల యజమానుల నుంచి, ఉత్పత్తిదారులు, వారి నుంచి పంపిణీదారులు; వీరి నుంచి బ్యాంకర్ల వరకు అందరి పరిస్థితి ఇదే. ఇది రాజకీయ ఆర్థిక వ్యవస్థ కంటే చాలా విస్తృతమైనది. నిజం చెప్పుకోవాలంటే, యువమంత్రి పరిధికి మించినది. కానీ జయంత్ సిన్హా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్‌ల కలసి ఈ యువమంత్రి బీజేపీకి కావలసిన రేపటితరం బృందాన్ని నిర్మిస్తారు.
 
7. రక్షణ, మనోహర్ పారికర్; రైల్వే, సురేశ్ ప్రభు: సాపేక్షంగా చూస్తే పారి కర్ ఈ శాఖలో తక్కువ కాలమే పనిచేశారు. అయినా సౌత్ బ్లాక్‌కు ఆయన తాజాదనంతో పాటు, కొంత క్రమ రాహిత్యాన్ని కూడా తెచ్చారు. ఒక ఉగ్రవా దిని పట్టుకోవడానికి ఇంకో ఉగ్రవాదికే సాధ్యం వంటి ప్రకటనలు ఇస్తేనేమి, అలాంటి మాటలు వివాదాస్పదమైతేనేం, ఆంటోనీ సృష్టించిన ఎనిమిదేళ్ల నిశ్శబ్దం తరువాత ఈ శాఖకు అందుబాటులో ఉండే, తన మనసులో ఉన్నదే మిటో బయటకు చెప్పే ఒక మంత్రి రావడం అద్భుతమే. విలువైన ఆయన చదువుకు కానుకగా (ఐఐటీ, ముంబై), నిజాయితీపరునిగా ఆయనకు ఉన్న ప్రతిష్టలతో పారికర్‌కు ఆ పదవి లభించింది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్దదైన సైన్యాన్ని నిర్వహించడం ఒక్కటే కాదు, ఆ పదవి ద్వారా ఆయన నిర్వహించవలసిన చాలా ముఖ్య కార్యకలాపాలు ఇంకా ఉన్నాయన్న సంగ తిని ఆయన ఆవిష్కరించాలి. సైనిక వ్యవహారాలలో విప్లవం (రివల్యూషన్ ఇన్ మిలటరీ ఎఫైర్స్) మీద చర్చల దగ్గర నుంచి, సైన్యం ఉపయోగం గురిం చీ, రక్షణ,నియంత్రణలను గురించి మొత్తం సిద్ధాంతం తయారైంది. ఎటొచ్చీ ఇప్పుడు భారత్‌కు ఆ అంశాలలో కరతలామలకమైన పట్టు ఉన్న ఒక రక్షా మంత్రి కావాలి. తను ఎంతో అభిమానించే మంత్రిత్వ శాఖకు మోదీ ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తి సురేశ్ ప్రభు. ఆయన కూడా నిస్సంకోచంగా బాధ్యతలు స్వీకరించారు. మొదటిసారి రైల్వే బడ్జెట్ కొత్త రైళ్లను ప్రతిపాదించలేదు. పాత, ప్రజాకర్షక లక్షణాలను మార్చుకోలేదు. ఆయన పని చాలా విస్తృతమైనది. అందుకు ఆయనకు కొంత సమయం, సహనం కూడా కావాలి.

8. ఆర్థికశాఖ, అరుణ్ జైట్లీ: మంత్రిమండలిలో అత్యంత ప్రాధాన్యం కలి గిన రెండో సభ్యునిగా అరుణ్ జైట్లీ తన ప్రధానికి బాగానే సేవలు అందిం చారు. కొన్ని అంకెలతో పేచీ రాబోతున్నప్పటికీ ఆయన బడ్జెట్ పురోగ మనదృష్టి కలిగినదే. ఆయన వ్యాపారవేత్తలకు, మీడియాకు (ఆయన సమా చార, ప్రసారశాఖ మంత్రి కూడా) అందుబాటులో ఉంటారు. చెప్పిందే చెబుతూ, సూటిగా చెప్పవలసింది చెబుతారు. అయితే పాత పునరావృత పన్ను విధాన నిబంధనను ఎందుకు తొలగించలేకపోతున్నారో మాత్రం చెప్ప రు. పన్నుల బీభత్సం గురించి భయపెడుతున్న మ్యాట్-ఫీ అంశాన్ని ఎం దుకు పరిశీలించరో కూడా వివరించరు.
 
9. విదేశీ వ్యవహారాలు, సుష్మా స్వరాజ్:
ఎంతో మాట్లాడవలసిన మంత్రి త్వశాఖలో ఉండి మౌనంగా ఉన్న మంత్రి. అయితే విదేశాంగ విధానం మీద ప్రధాని సరికొత్త అభిప్రాయాలను గురించి కొన్ని వేదికల మీద మాత్రం ఆమె గట్టిగానే మాట్లాడారు. ఆమె విదేశీ వ్యవహారాల కార్యాలయాన్ని బాగా నిర్వహించారు. మానవీయ కోణానికి అవకాశం ఇచ్చారు. ఎమెన్ నుంచి భారతీయులు నిరాశతో సోషల్ మీడియా ద్వారా పంపిన సందేశాలకు కూడా స్పందించారు. అందుకే ఇండియా టుడే తాజా సంచిక నిర్వహించిన పోల్స్ ప్రకారం ఆమె ఉత్తమమంత్రి స్థానం గెలుచుకున్నారు. నా ఉద్దేశం ప్రకారం పార్లమెంటులో భూమి సరిహద్దు ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అన్ని పార్టీలతో కలసి ఆమె నిర్వహించిన పాత్ర చెప్పుకోదగినది.

10. గణాంకాలు (సహాయ మంత్రి, ఇండిపెండెంట్ చార్జి), విదేశీ వ్యవహా రాలు (సహాయ మంత్రి) రిటైర్డ్ జనరల్ వీకే సింగ్: ఇండిపెండెంట్ మంత్రిగా ఆయన నిర్వహించిన ఆసక్తికర అంశాలు ఏమిటో ఇంకా మనకు తెలియవలసి ఉన్నా, ఆయనే మన టాపర్. ఆయనకు ప్రత్యేకంగా రెండు లక్ష్యాలను నిర్దేశిం చారు. ఎమెన్‌లో ఏకాకులైన భారతీయులను తరలించడం అందులో ఒకటి. దానిని ఆయన అత్యంత శ్రద్ధతో, నిబద్ధతతో నిర్వహించారు. రెండోది- మీడి యాను గందరగోళం చేయడం. మొదటిదానిలాగే దీనిని కూడా చాలా అభి రుచితో, ఒంటి చేత్తో నిర్వహించారు. ప్రధాని బహిరంగంగా ప్రశంసల వర్షం కురిపించిన మంత్రి ఆయన ఒక్కరే.  విశాల్ భరద్వాజ్ ‘సి’ అనే పదాన్ని తెచ్చినట్టు, ఆయన ‘పి’ అనే పదాన్ని మన ఉపన్యాసాలకు అందించారు. ఆయనకు రేటింగ్‌ను నిర్ణయించడం చాలా సీరియస్ అంశమే. అదెందుకో కూడా నేను నొక్కి చెప్పాలి. నేను ఆయ న్ను సమర్థిస్తున్నప్పుడు (పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా వీకే సింగ్ ఆ దేశ హైకమిషన్ కార్యాలయానికి హుందాగా, విధ్యుక్తధర్మంతో వెళ్లిన పుడు నేను ఇలాగే సమర్ధించాను) లక్షలాది ఆయన అభిమానుల ముందు మరుగుజ్జనయిపోతాను. ఏమైనా 10/10 మంది భిన్నభిన్న ఫలితాలు సాధి స్తారేమో వేచి చూద్దాం.

 
 
 http://img.sakshi.net/images/cms/2015-05/51432927050_Unknown.jpg

శేఖర్ గుప్తా
shekhargupta653@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement