అసమర్థత, అవినీతితోనే యూపీఏ ఓటమి | upa loss with Inability of corruption | Sakshi
Sakshi News home page

అసమర్థత, అవినీతితోనే యూపీఏ ఓటమి

Published Tue, May 20 2014 3:11 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అసమర్థత, అవినీతితోనే 	యూపీఏ ఓటమి - Sakshi

అసమర్థత, అవినీతితోనే యూపీఏ ఓటమి

వామపక్షాల ఓటమి విచారకరం  చాడ వెంకట్‌రెడ్డి
కరీంనగర్, న్యూస్‌లైన్: అసమర్థత, అవినీతితోనే యూపీఏ ఓడిపోయింద ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం పదేళ్ల కాలంలో అవినీతిని పెంచి పోషించిందని విమర్శించారు. నిరుద్యోగం, అడ్డూ అదుపులేని అవినీ తిని ప్రజలు తిరస్కరించారన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానన్న మోడీని నమ్మి ప్రజలు బీజేపీకి పట్టంకట్టారని పేర్కొన్నారు.

 విభేదాలు పక్కనబెట్టి చంద్రబాబునాయుడు, కేసీఆర్  కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజా సమస్యలపై ని త్యం స్పందించే వామపక్షపార్టీలను ప్రజలు ఆదరించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న కేసీఆర్‌కు సీపీఐ పక్షాన సహకరిస్తామని తెలిపారు. నవ తెలంగాణ నిర్మాణంలో పార్టీలకతీతంగా అన్నివర్గాల ప్రజలు భాగస్వాములుకావాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ, బోయిని అశోక్, పైడిపెల్లి రాజు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement