సీపీఐ నేత అరెస్ట్‌పై వెల్లువెత్తుతున్న నిరసనలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు జలవనరులశాఖ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారుతోంది. నెల్లూరు జిల్లా జలవనరుల శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాడుతున్న సీపీఐ నాయకుడు నరహరిని తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడంపై సీపీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్యాకేజీ నంబర్ 35లో జరుగుతున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ఏడాది కాలంగా పోరాటం చేస్తున్న సీపీఐ నేత నరహరి సమాచార చట్టంతో సమాచారాన్ని సేకరిస్తూ అవినీతి పనులకు అడ్డు తగులుతున్నారని నేతలు తెలిపారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పనులను పూర్తి చేయకముందే ఇచ్చిన కంప్లీషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని, కాలువలు, రిజర్వాయర్ మీద అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అధిక చెల్లింపులను వెంటనే రికవరీ చేయాలని ఏడాదికి పైగా నరహరి పోరాటం చేస్తున్నారని వివరించారు.
ఈ విషయమై సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని నాయకులు గుర్తు చేశారు. ప్యాకేజీ పనుల్లో అవకతవకలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే కాంట్రాక్టర్ సక్రమంగా పనులు పూర్తి చేసినట్లు చూపుతూ నగదు చెల్లించేందుకు అధికారులు యత్నించడాన్ని నరహరి అడ్డుకుని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై సీపీఐ నేతపై అక్రమ కేసులను బనాయించి అరెస్ట్ చేశారని ఎస్పీ విశాల్‌గున్నీని శుక్రవారం కలిసి వివరించారు. దీనికి సంబంధించిన పత్రాలను తీసుకురావాలని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచినట్లు వారు తెలిపారు.
అవినీతిని ప్రశ్నిస్తే.. అరెస్టులా..?
Published Sat, Mar 19 2016 4:00 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement