తప్పుడు వాగ్దానాలతో మోసగించారు
మచిలీపట్నం (కోనేరుసెంటర్) :
బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలను కలుపుకొని ముందుకు వెళదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో జరిగిన సీపీఐ జిల్లాసమితి కౌన్సిల్ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పాలనంతా అవినీతితో కూరుకుపోయిందన్నారు. ఎన్నికలలో అమలు చేయలేని వాగ్ధానాలతో ప్రజలను మోసగించారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒనగూరిందేమీలేదన్నారు. రాబోయే ఎన్నికలలో మూడో ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకా«శం ఉందన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పేరుకుపోయిందని, చంద్రబాబునాయుడు తన పార్టీలో ఏ ఒక్కరినీ అదుపు చేసే పరిస్థితి లేదన్నారు. పార్టీ జాతీయ సమితి కంట్రోల్ కమిషన్ చైర్మన్lఈడ్పుగంటి నాగేశ్వరరావు కమ్యూనిస్టు ఉద్యమం చరిత్ర, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను వివరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చలసాని రామారావు, మోదుమూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.