ఖాకీలే గంజాయిమాఫియా | From retailers to charge Rs .Crores | Sakshi
Sakshi News home page

ఖాకీలే గంజాయిమాఫియా

Published Wed, Nov 30 2016 1:36 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

ఖాకీలే గంజాయిమాఫియా - Sakshi

ఖాకీలే గంజాయిమాఫియా

వ్యాపారుల నుంచి రూ.కోట్లు వసూలు
తిరిగి తమపై గోబెల్స్ ప్రచారం
మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఆరోపణ
పీఎల్‌జీఏ వార్షికోత్సవాన్ని గ్రామ గ్రామాన జరపాలని  పిలుపు

విశాఖపట్నం :   అవినీతి పరులు, గంజారుు మాఫియా పోలీసు అధికారులేనని సీపీఐ (మావోరుుస్టు) పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కై లాసం   ఆరోపించారు. ఈ మేరకు ఆయన  మంగళవారం ఓ లేఖ విడుదల చేశారు. మీడియాకు కూడా కై లాసం మరో లేఖ రాశారు. పోలీసులు  చెబుతున్న మాటలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, ప్రజా సమస్యలపై తమ స్పందనలకు ప్రాధాన్యం  ఇవ ్వడం లేదని, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి వాస్తవాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై కై లాసం తీవ్ర పదజాలంతో ఆరోపణలు గుప్పించారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఓఎస్‌డీ బాపూజీలు తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజానికి గంజారుు వ్యాపారాన్ని సాఫీగా నిర్వహిస్తున్నది పోలీసులేనని పేర్కొన్నారు. గత ఎస్పీతో పాటు, కొందరు సీఐలు, ఎస్‌ఐలు   గంజారుు వ్యాపారుల నుంచి రూ.కోట్ల ధనాన్ని వసూలు చేసి సొంత ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపించారు. పోలీసు బలగాలు, పోలీస్ స్టేషన్లు, చెక్‌పోస్టులు మధ్య వ్యభిచారం, అత్యాచారాలు, రియల్ ఎస్టేట్ మాఫియా, గంజారుు మాఫియా కార్యకలాపాలు సాఫీగా సాగిపోతున్నాయంటే వాటిలో పోలీసుల ప్రమేయం లేకుండా జరుగుతాయా అని ప్రశ్నించారు. ఈ విషయాలను కప్పిపుచ్చుకోవడానికే మావోరుుస్టు పార్టీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

గంజారుు వ్యాపారులను పట్టుకున్నామంటూ కూలీలను చూపిస్తున్నారని, నిజానికి   దారకొండ, దుప్పిలవాడ పంచాయతీల్లో పోలీసులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒడిశాలోని బొపసాడ, ఆటగుడ, చర్యపల్లి ప్రాంతాల బీఎస్‌ఎఫ్ పోలీసులు అక్కడి రైతు కుటుంబాల నుంచి రూ.5 వేలు, రూ.10వేలు వసూలు చేస్తున్నారన్నారు. గంజారుు వ్యాపారుల నుంచిగాని, రైతుల నుంచి గాని మావోరుుస్టు పార్టీ చిల్లి గవ్వ కూడా వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 2న పీఎల్‌జీఏ 16వ వార్షికోత్సవాన్ని గ్రామ గ్రామాన ఘనంగా  జరపాలని గిరిజనులకు ఆయన విజ్ఞప్తి చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement