'అవినీతి రొంపిలో కేంద్ర ప్రభుత్వం' | central governement completely dipped in corruption | Sakshi
Sakshi News home page

'అవినీతి రొంపిలో కేంద్ర ప్రభుత్వం'

Published Mon, Jul 20 2015 1:38 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

central governement completely dipped in corruption

హైదరాబాద్: కేంద్రప్రభుత్వంపై వామపక్ష నేత సీపీఐ నారాయణ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి రొంపిలో కూరుకుపోయిందని తీవ్రంగా విమర్శించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు ఎంతో అవినీతికి పాల్పడ్డారని వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇక కేంద్ర మంత్రులు కూడా అలాంటి బాటలోనే కొనసాగారని, వారు చేసిన అవినీతికి బాధ్యత వహించి వెంటనే రాజీనామాలు చేసి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అవినీతికి నిరసనగా సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు వామపక్షాల ర్యాలీ తీసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement