
ముంబై: ప్రస్తుతం యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ (యూపీఏ) లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముంబై పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ.. ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో బుధవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. తాము పలు కీలక అంశాలపై చర్చించామని, భావ సారుప్యత ఉన్న అన్ని పార్టీలు ఏకమైతే బీజేపీకి ప్రత్యామ్నయ కూటమిగా ఏర్పడి ఓడించవచ్చని పేర్కొన్నారు.
చదవండి: చనిపోయిన రైతులకు సాయం చేయలేం: కేంద్రం
భాగసామ్య కూటమికి ఎవరు అధ్యక్షత వహిస్తారనే విషయం చర్చకు రాలేదని తెలిపారు. బీజేపీ వ్యతిరేకంగా ఉన్న ప్రతి పార్టీని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీలు కలిసికట్టు ఉండి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడదామని తెలిపారు. శరద్ పవార్‌ను యూపీఏ చైర్‌పర్సన్‌గా ప్రకటించాలా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ప్రస్తుతం యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్(యూపీఏ) ఉందా? ఇప్పుడైతే దేశంలో యూపీఏ లేదని అన్నారు. యూపీఏ చైర్‌పర్సన్ కూర్చుకొని అక్కడ ఆయన ఏం చేస్తారు?అని అన్నారు.
చదవండి: ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్! జుకర్‌బర్గ్ ప్రమేయం లేదు, కానీ..
అయతే, తాము మరో ప్రత్యామ్నయ భాగాస్వామ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మంగళవారం మమతా శివసేన నేతలు సంజయ్‌రౌత్, సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక మమతా బేనర్జీ 2024 ఎన్నికల్లో పలు పార్టీలను ఏకంచేసి బీజేపీ ఓడించాలని ప్రయత్నం చేస్తున్నసంగతి తెలిసిందే.