ఏపీలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తాం: వెంకయ్య
తిరుపతి: నిత్యావసర వస్తువల ధరల పెరుగుదలకు గత యూపీఏ ప్రభుత్వమే కారణమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 2020 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని ఆయన అన్నారు.
త్వరలోనే తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. తిరుపతి చేరుకున్న వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.