ఎయిర్ ఇండియాపై సీబీఐ కేసు
Published Tue, May 30 2017 5:35 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ ల విమానాల కోనుగోలు ఒప్పందాల్లో కుంభకోణాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఒప్పందాన్ని గత యూపీఏ ప్రభుత్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కెబినెట్ ఆమోదించింది. ఇప్పటికే బొగ్గు, టెలికాం సెక్టార్‌లో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ తాజాగా 111 విమానాల కోనుగోలులో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఈ వ్యవహారంపై కేంద్ర విమానాయనశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ చేపట్టాలని జనవరిలోనే సుప్రీం కోర్డు సూచించింది. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ అవతవకలు జరిగాయని తేలడంతో సోమవారం మూడు కేసులు నమోదు చేసింది. రూ. 70 వేల కోట్లతో విమానాలు కొనుగోలు చేయడంతో జాతీయ విమానాయ సంస్థ ఆర్ధికంగా నష్టపోయిందని, ఈ వ్యవహారం ప్రయివేటు సంస్థలకు లాభాదాయకంగా ఉందని దర్యాప్తు బృందం పేర్కొంది.
2005 లో యూపీఏ ప్రభుత్వం బోయింగ్ కంపెనీ నుంచి ఎయిర్ ఇండియా 68 విమానాలు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఒక సంవత్సరం అనంతరం ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎయిర్ బస్ నుంచి 43 విమానాలు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2007 లో ఈ రెండు జాతీయ విమానయ సంస్థలు వీలీనమై ఎయిర్ ఇండియాగా సేవలందిస్తున్నాయి.
Advertisement
Advertisement