న్యూఢిల్లీ: గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పతనానికి కారణం, అప్పటి కాంప్ట్రోలర్ ఆడిటర్ జన రల్ (కాగ్) వ్యవస్థ నివేదికలు కానేకాదని మాజీ కాగ్ చీఫ్ వినోద్ రాయ్ స్పష్టంచేశారు. 2 జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు బ్లాకుల కేటాయింపు వ్యవహారాల కు సంబంధించిన కాగ్ నివేదికలు, వాటిపై జారీ అయిన సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే యూపీఏ పరాజయం పాలైందన్న వాదన సరికాదన్నారు. ఈ విషయంలో కాగ్ పాత్రను అతిగా ఊహించడమేని, కాగ్‌కు ఘనతనో, నిందనో కట్టబెట్టడం సరికాదని వినోద్ రాయ్ వ్యాఖ్యానించారు.