మన్మోహన్‌పై విచారణ జరిపించండి! | do inquiry on manmohan singh | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌పై విచారణ జరిపించండి!

Published Fri, Jul 25 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

మన్మోహన్‌పై విచారణ జరిపించండి!

మన్మోహన్‌పై విచారణ జరిపించండి!

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని కొనసాగించడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ లేవనెత్తిన దుమారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ న్యాయమూర్తిపై ఐబీ ఇచ్చిన వ్యతిరేక నివేదికకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతికి చెప్పకుండా.. ఆ న్యాయమూర్తి నియామకానికి సిఫారసు చేశారంటూ గురువారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, న్యాయశాఖ మాజీ మంత్రి హెచ్‌ఆర్ భరద్వాజ్‌లపై విచారణ జరపాలని ఆ పిల్‌లో కోరారు. ఇది రాజ్యాంగబద్ధ కార్యాలయాన్ని మోసం చేయడమేనని, అందువల్ల దీన్ని తీవ్రమైన అవినీతి వ్యవహారంగా పరిగణించాలని  పిల్‌లో న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ పిల్‌ను పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement