Justice Markandeya katju
-
‘ఆయన బ్రిటిష్ ఏజెంట్’
సాక్షి, న్యూఢిల్లీ : సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మద్దతుగా నిలిచారు. పెరియార్ బ్రిటిష్ ఏజెంట్‌గా వారి విభజించి పాలించే విధానాన్ని ముందుకు తీసుకువెళ్లారని కట్జూ ఆరోపించారు. తమిళ మ్యాగజైన్ తుగ్లక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెరియార్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. గతంలో సీతారాముల విగ్రహాలకు చెప్పుల దండ వేసి చేపట్టిన ర్యాలీలో పెరియార్ పాల్గొన్నారని ఈ వార్తను ఏ ఒక్కరూ కవర్ చేయలేదని రజనీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. పెరియార్‌పై రజనీ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై జస్టిస్ కట్జూ తన ఫేస్బుక్ పేజ్‌లో స్పందించారు. బ్రిటిష్ పాలకులకు ఊడిగం చేసిన ఇతరులెందరి మాదిరిగానే పెరియార్ కూడా బ్రిటిష్ ఏజెంటేనని..ఆయన ఉద్దేశాలు ఏమైనా బ్రిటిషర్ల విధానమైన విభజించి పాలించనే సిద్ధాంతానికి అనుగుణంగా పెరియార్ వ్యవహరించారని అన్నారు. దీనిపై పలు వెబ్సైట్లు, తన బ్లాగ్‌లో రాసిన వ్యాసాలను పరీశీలించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. కాగా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై 2017లో మార్కండేయ కట్జూ విమర్శలు గుప్పించడం విశేషం. పేదరికం, నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలకు రజనీ వద్ద పరిష్కారం ఉందా అంటూ తన బ్లాగ్‌లో ఆయన తమిళ సూపర్‌స్టార్ రజనీని ప్రశ్నించారు. చదవండి : పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో.. -
ఆలోక్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: అగ్నిమాపక శాఖలో తాను పనిచేయబోవడం లేదనీ, తనను ఇక పదవీ విరమణ పొందినట్లుగా గుర్తించాలని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఆలోక్‌వర్మ కేంద్ర సిబ్బంది విభాగానికి తెలియజేశారు. తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఇక తనను రిటైర్ అయినట్లుగానే భావించాలని ఆయన కోరారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్‌గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే. తనను అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారనీ, అవి కూడా తన విరోధి అయిన ఒకే ఒక్క వ్యక్తి దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప ఇతరులెవరూ తనను వేలెత్తి చూపలేదని వర్మ ఉద్ఘాటించారు. సీబీఐ డైరెక్టర్ పదవికి ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు మళ్లీ నియమించిన రెండ్రోజుల్లోనే, అత్యున్నత స్థాయి త్రిసభ్య ఎంపిక కమిటీ ఆయనను 2:1 ఆధిక్యంతో ఆ పదవి నుంచి తప్పించి, అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఆయన మౌనం వీడుతూ గురువారం రాత్రి పీటీఐకి ఓ ప్రకటన పంపారు. ‘సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటి. దాని స్వతంత్రతను కాపాడాలి. బయటి శక్తుల ప్రమేయం లేకుండా అది పనిచేయాలి. సీబీఐని నాశనం చేయడానికి కొందరు చూస్తున్నప్పుడు, ఆ సంస్థ నిజాయితీని, ప్రతిష్ఠను కాపాడేందుకు నేను ప్రయత్నించాను. నాకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి చేసిన అబద్ధపు ఆరోపణలపై నన్ను బదిలీ చేయడం బాధాకరం’ అని వర్మ వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆలోక్‌ను పదవి నుంచి బదిలీ చేసింది. ఖర్గే కూడా ఆలోక్ బదిలీని వ్యతిరేకిస్తూ ఆయన వాదన వినాలని పట్టుబట్టినా, మోదీ, జస్టిస్ సిక్రీ కలిసి ఆలోక్‌ను బదిలీ చేశారు. మళ్లీ బదిలీలన్నీ రద్దు గురువారం రాత్రి మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.నాగేశ్వర రావు, సంస్థలో అంతకుముందు ఆలోక్ వర్మ చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేశారు. గతేడాది అక్టోబర్‌లో నాగేశ్వరరావు డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించగానే, ఆగమేఘాల మీద పలువురు అధికారులను బదిలీ చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌వర్మ ఆ బదిలీలన్నింటినీ రద్దు చేయడం తెలిసిందే. తాజాగా, మళ్లీ నాగేశ్వరరావుకు బాధ్యతలు వచ్చాక, ఆలోక్ వర్మ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అన్నింటినీ రద్దు చేశారు. ప్రభుత్వం రాజకీయ బుల్లెట్లు పేలుస్తోంది ప్రభుత్వం సీబీఐని బలహీనపరుస్తోందనీ, సీవీసీ భుజాల నుంచి రాజకీయ బుల్లెట్లను పేలుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వంతో కలిసి రాజ్యాంగాన్ని సీవీసీ ఉల్లంఘిస్తోందంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ఊహలు, వాదనల ఆధారంగా సీవీసీ ఇచ్చిన నివేదికను అనుసరించి సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మను తొలగించడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. అయితే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మాత్రం సంబంధిత పత్రాలు సమర్పించినా సీవీసీ స్పందించడం లేదని ఆరోపించారు. -
వర్మ అవినీతిపై ఆధారాలున్నాయనే!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో విపక్ష నేత ఖర్గేల అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఆలోక్ వర్మను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ ఒక ఆసక్తికర అంశాన్ని ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. వర్మను తొలగించే ప్రతిపాదనకు ఎందుకు మద్దతిచ్చావని శుక్రవారం ఉదయమే ఫోన్ చేసి జస్టిస్ సిక్రీని తాను ప్రశ్నించానని, అందుకు ఆయన సమాధానమిచ్చారని కట్జూ చెప్పారు. వర్మపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని, అవి చూశాకే.. విచారణ ముగిసేవరకు సీబీఐ డైరెక్టర్ పదవిలో వర్మ కొనసాగడం సరికాదని తాను భావించినట్లు జస్టిస్ సిక్రీ వివరించారని కట్జూ వెల్లడించారు వర్మ వివరణ తీసుకున్నాకే సీవీసీ ఆ నివేదిక రూపొందించిన విషయాన్ని జస్టిస్ సిక్రీ చెప్పారన్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఆయన నుంచి తాను అనుమతి తీసుకున్నానన్నారు. అయితే, సీబీఐ చీఫ్‌గా వర్మను తప్పించిన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని జస్టిస్ కట్జూ స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్‌గా తొలగించే ముందు వర్మ వివరణ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ‘సాధారణంగా, సస్పెండ్ చేసే ముందు కూడా సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకున్నాకే చర్య తీసుకుంటారు. వర్మను సస్పెండ్ చేయలేదు.. డిస్మిస్ చేయలేదు. కేవలం సమాన హోదా కలిగిన పోస్ట్‌కు బదిలీ చేశారు’ అని జస్టిస్ కట్జూ గుర్తు చేశారు. వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను ఖర్గే వ్యతిరేకించారు. -
‘అవినీతి జడ్జికి అందలం’
మాజీ సీజే ఐ బాలకృష్ణన్ పై కట్జూ తీవ్ర ఆరోపణలు న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ కొత్త వివాదాన్ని లేవనెత్తారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ కేజీ బాలకృష్ణన్ లక్ష్యంగా మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి నేపథ్యం ఉన్న మద్రాసుహైకోర్టు న్యాయమూర్తి ఒకరికి, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ప్రమోషన్ కట్టబెట్టడానికి జస్టిస్ బాలకృష్ణన్ తీవ్రంగా ప్రయత్నించారని కట్జూ ఆరోపించారు. అవినీతి జడ్జిని సుప్రీంకోర్టు పదవి వరకూ తీసుకెళ్లడంలో జస్టిస్ బాలకృష్ణన్ అధ్యక్షతలోని కొలీజియం దాదాపుగా సఫలమైందని, జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా అందులో సభ్యుడని కట్జూ పేర్కొన్నారు. అయితే, సదరు జడ్జిపై తమిళనాడు లాయర్లు, భారీఎత్తున డాక్యుమెంటరీ ఆధారాలు చూపడంతో బాలకృష్ణన్ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. కట్జూ ఆదివారం తన బ్లాగ్‌లో తాజా ఆరోపణలు చేశారు. పూర్తిగా అనర్హుడైన జడ్జిని సుప్రీంకోర్టు స్థాయికి తెచ్చేందుకు బాలకృష్ణన్ నేతృత్వంలోని కొలీజియం ప్రయత్నించిందని, తాను మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉండగా, అక్కడే సదరు జడ్జి పనిచేశారు కాబట్టి, ఆయన అపకీర్తి ఏమిటో తనకు తెలుసుసని కూడా కట్జూ వ్యాఖ్యానించారు. అతని గురించి కొలీజియం సభ్యుడైన కపాడియాకు వివరాలందించినా, అదే జడ్జి పేరును సిఫార్సుచేయడం విచిత్రమన్నారు. అందుబాటులో లేని బాలకృష్ణన్ కాగా, కట్డూ చేసిన ఈ ఆరోపణలపై జస్టిస్ బాలకృష్ణన్ స్పందనకోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేరు. జస్టిస్ కపాడియా స్పందిస్తూ, అర్హతలేని ఏ జడ్జినీ తాను సుప్రీంకోర్టువరకూ తేలేదన్నారు. కట్జూ ఆరోపణలన్నీ అర్థరహితమైనవన్నారు. జడ్జి పేరును కూడా కట్జూ తన బ్లాగ్‌లో వెల్లడించలేదని, అతను ఎవరిగురించి ప్రస్తావిస్తున్నారో తనకు తెలియదని క పాడియా అన్నారు. -
మన్మోహన్పై విచారణ జరిపించండి!
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని కొనసాగించడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ లేవనెత్తిన దుమారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ న్యాయమూర్తిపై ఐబీ ఇచ్చిన వ్యతిరేక నివేదికకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతికి చెప్పకుండా.. ఆ న్యాయమూర్తి నియామకానికి సిఫారసు చేశారంటూ గురువారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, న్యాయశాఖ మాజీ మంత్రి హెచ్ఆర్ భరద్వాజ్‌లపై విచారణ జరపాలని ఆ పిల్లో కోరారు. ఇది రాజ్యాంగబద్ధ కార్యాలయాన్ని మోసం చేయడమేనని, అందువల్ల దీన్ని తీవ్రమైన అవినీతి వ్యవహారంగా పరిగణించాలని పిల్లో న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ పిల్‌ను పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.