
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (79)కు శనివారం పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నేత రాహుల్ ఆయనకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. 1990వ దశకంలో పవార్‌కు ప్రధానమంత్రి పదవి రెండుసార్లు అందినట్టే అంది దక్కకుండా పోయిందని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొన్ని పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు రాశారు. చదవండి: యూపీఏ చైర్మన్‌గా పవార్ మాకు ఓకే : సంజయ్‌రౌత్
కాంగ్రెస్‌లోని దర్బార్ రాజకీయాల వల్లే పవార్ ప్రధాని కాలేకపోయారని వెల్లడించారు. పవార్ తమ పార్టీకి విధేయుడు కాదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. దీనిపై శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. ప్రతిభ లేని కొందరు వ్యక్తులకు పవార్ అంటే భయమని, ఆందుకే ప్రధాని పదవి దక్కకుండా చేశారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment