
ముంబై బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : జగన్మోహన్ రెడ్డి సోమవారం ముంబై బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్ను ఏకపక్షంగా విభజించేందుకు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పలు రాజకీయ పక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్తో భేటీ కానున్నారు.
అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అవుతారు. ముంబై వెళ్లిన పార్టీ ప్రతినిధి బృందంలో జగన్తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్.పి.వై. రెడ్డి, మాజీ ఎంపీలు, ఎం.వి.మైసూరారెడ్డి, వి.బాలశౌరి, పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, నల్లా సూర్యప్రకాష్లు ఉన్నారు.