
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే సీఎం పదవి చేపట్టబోయేది ఎవరో బీజేపీ కీలక నేత,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హింట్ ఇచ్చారు. శివసేనకు చెందిన వ్యక్తే తమ కూటమి తరపునన సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పకనే చెప్పారు. బుధవారం(అక్టోబర్16) ముంబయిలో ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్డు కార్డు విడుదల చేస్తూ ఫడ్నవిస్ మాట్లాడారు.
తమ చీఫ్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారని,దమ్ముంటే మహావికాస్‌అఘాడీ(ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు సవాల్ విసిరారు. మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదు.
మా సీఎం ఇక్కడే ఉన్నారు. ఎంవీఏ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు ఎందుకంటే వాళ్లకు గెలుస్తామన్న నమ్మకం లేదు. శరద్‌పవార్‌కు సవాల్ విసురుతున్నా. ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించండి’అని ఫడ్నవిస్ శరద్‌పవార్‌ను కోరారు. కాగా, ఎన్డీఏ కూటమిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: షిండే సీఎం కాదు.. కాంట్రాక్టర్ మంత్రి