నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ బీజేపీపై వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ మేరకు ఆయన జౌరంగబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటూ..ప్రజల్లో మార్పు వస్తుందన్నారు. మహారాష్ట్రలో చిన్న చిన్న సంఘటనలకు మత రంగు పులిముతున్నారని, ఇది మంచి సంకేతం కాదని అన్నారు. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఓటమిని చవిచూసిందన్నారు.
ఈ దృష్టాంతాన్ని చూస్తుంటే బీజేపీపై వ్యతిరేకత ప్రారంభమైందని భావిస్తున్నానని చెప్పారు. ప్రజలు మనస్తత్వం ఇలానే కొనసాగితే దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని జ్యోతిష్కుడిని సంప్రదించాల్సిన పనిలేదన్నారు. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు..ఎన్సీపీ చీఫ్ తన పార్టీ మిత్రపక్షాలు నుంచి చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇలా జరగడం వల్ల పాలకులు గందరగోళంలో పడతారని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. వారు లోక్‌సభ ఎన్నికలపై కూడా అంతే స్థాయిలో దృష్టి పెడతారని అన్నారు.
అలాగే మహారాష్ట్రలో ప్రకటించిన తెలంగాణ మోడల్(రైతులకు ఆర్థిక సాయం)పై శరద్ పవార్ మాట్లాడుతూ..తెలంగాణ మోడల్‌కు గురించి తనిఖీ చేశానన్నారు. ఐతే తెలంగాణ చిన్న రాష్ట్రం, అలాంటి రాష్ట్రంలో ఇలాంటి సాయం ప్రకటించొచ్చు అన్నారు. అలాగే మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితి, కొన్ని హింసాత్మక సంఘటనల గురించి ప్రశ్నించగా..శాంతిభద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందని, కానీ అధికార పార్టీలు రోడ్డపైకి వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టడం మంచి పరిణామం కాదన్నారు.
అంతేగాదు రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఎన్సీపీ అధినేత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దృక్ఫథం కూడా అంత సానుకూలంగా లేదన్నారు. ఇదే క్రమంలో విలేకరులు నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో కేంద్రంలో మీకు ఇష్టమైన మంత్రి ఎవరు అని అడిగిన ప్రశ్నకు పవార్..కొంతమంది పని విషయమై వెళ్తే వివాదాస్పదంగా మాట్లాడతారు. ఉదాహరణకు నితిన్ గడ్కరీ వద్దకు వెళ్తే..అతను పార్టీ కోణంలో ఉండడు. అతను పని ప్రాముఖ్యతనే తనిఖీ చేస్తాడంటూ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు శరద్ పవార్.
Comments
Please login to add a commentAdd a comment