'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్' లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ చిహ్నంగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా'ను ఉపయోగించడానికి సుప్రీంకోర్టు మార్చి 19న అనుమతించింది. ఈ గుర్తును శరద్ పవార్ వర్గానికి రిజర్వ్ చేయాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)ని ఆదేశించిన సుప్రీంకోర్టు, అది ఏ ఇతర పార్టీ లేదా అభ్యర్థికి గుర్తును కేటాయించకూడదని పేర్కొంది.
శరద్ పవార్ స్థాపించిన NCP గత ఏడాది జూలైలో అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. పార్టీ విడిపోయిన తరువాత కూడా లోగో, పేర్లను వాడుతున్నారని శరద్ పవార్ వర్గం పిటిషన్ వేసింది. అయితే ఇప్పుడు వారికి కొత్త గుర్తును కేటాయించడం వల్ల.. అజిత్ పవార్ గ్రూపును నిజమైన NCPగా ఎలక్షన్ కమీషన్ పేర్కొంది. కాబట్టి పార్టీ గుర్తును వారికే కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment