ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆర్థిక శాఖ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రెబల్ నేత, అజిత్ పవార్ చేతికి వెళ్లింది. మహారాష్ట్ర మంత్రివర్గంలో జూలై 2న చేరిన (ఎన్నీపీ) ఎమ్మెల్యేలకు శుక్రవారం నాడు శాఖల కేటాయింపు జరిగింది. ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ కీలకమైన ఆర్థిక శాఖను సొంతం చేసుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఇప్పటివరకూ ఆర్థికశాఖ బాధ్యతలు కూడా ఫడ్నవీస్ వద్దనే ఉంది. అయితే ఆర్థికశాఖపై కన్నేసిన అజిత్ పవార్ పంతం పట్టీ మరీ ఈ శాఖను దక్కించుకున్నారు. ఈ బాధ్యతల్ని వెంటనే ఆయన స్వీకరించారు.
బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన అజిత్ పవార్.. తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్‌లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నారు.
తాజాగా శాఖల కేటాయింపుల్లో, ఎన్‌సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్‌కు ఆహార, పౌర సరఫరాల శాఖ అప్పగించారు. అనిల్ పటేల్‌కు రిలీఫ్ అండ్ రిహాబిలేషన్, డిజాస్టర్ మేనేజిమెంట్ శాఖ కేటాయించారు. అదితి సునీల్ టట్కరేకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కేటాయించగా, ధనంజయ్ ముడేకు వ్యవసాయం, దిలీప్ వాల్సే పాటిల్‌కు రెవెన్యూ, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ కేటాయించారు.
ముఖ్యమైన పోర్ట్‌పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు బుజ్జగించాయి.
చదవండి: సుఖేష్ సంచలన ఆరోపణలపై కేటీఆర్ రియాక్షన్.. వాడెవడో కూడా తెలీదంటూ..
Comments
Please login to add a commentAdd a comment