ముంబై: మహారాష్ట్ర మాజీ కాంగ్రెస్ నేత బాబా సిద్ధిక్ కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్‌ను ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. ఇటీవల జీషన్ సిద్ధిక్ తండ్రి బాబా సిద్ధిక్ కాంగ్రెస్ రాజీనామా చేయటంతో యూత్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి జీషన్‌ను తెలగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీషన్ సిద్ధిక్ గురువారం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఇక.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా ఆయన ఎదుర్కొన్న చేదు అనుభవాలు పంచుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాకు తండ్రి సమానుడు. రాహుల్ గాంధీ గొప్ప నేత. కానీ రాహుల్ గాంధీ టీం కాంగ్రెస్‌కు చాలా ప్రమాదకరం. రాహుల్ గాంధీ టీం ప్రత్యర్థి పార్టీలా వ్యహరింస్తోంది’ అని తెలిపారు.
‘భారత్ జోడో యాత్ర సందర్భంగా నేను రాహుల్ గాంధీ కలవాలనుకున్నా. యాత్రలో నడుస్తున్న సమయంలో నా దగ్గరకు రాహుల్ గాంధీ టీంలోని ఓ వ్యక్తి వచ్చి పదికేజీల బరువు తగ్గమని అన్నాడు. అలా అయితే తాను నన్ను రాహుల్ గాంధీతో కలవడానికి అవకాశం కల్పిస్తానని అన్నారు. దీంతో నేను తీవ్రంగా స్పదించాను. నేను మీ ఎమ్మెల్యేను, ముంబై కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిని, నన్ను బాడీ షేమింగ్ చేస్తారా?’ అని సదరు వ్యక్తికి బదులు ఇచ్చినట్లు తెలిపారు.
‘రాహుల్ గాంధీ టీం.. కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తోంది. రాహుల్ టీం చాలా పొగరుతో ప్రవర్తిస్తోంది. నేను గత వారమే చెప్పాను. నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని. కానీ, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలకు ఆదరణ, రక్షణ లేదు. కాబట్టి మైనార్టీలకు పలు అవకాశాలు బహిరంగంగా ఉన్నాయి’ అని జీషన్ సిద్ధిక్ అన్నారు.
మరోవైపు.. అజిత్ పవార్ చాలా గొప్ప సెక్యూలర్ నేత అని జీషన్ సిద్ధిక్ వ్యాఖ్యలు చేయటంతో ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గంలో చేరనున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment