ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి అగ్గి మీద గుగ్గిలమవుతూ వేగంగా పావులు కదుపుతున్నారు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్. ఇందులో భాగంగా అజిత్ పవార్ కు తిరుగుబాటులో సహకరించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ప్రఫుల్ పటేల్, సునీల్ తాత్కారేలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.
ఆదివారం అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరి మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. తమతో ఉంటూనే తమకు వెన్నుపోటు పొడిచిన వారిని విడిచిపెట్టనని, పార్టీని పునర్నిర్మించుకుంటానని ఇదివరకే ప్రకటించిన శరద్ పవార్ కార్యాచరణ మొదలుపెట్టారు. మొదటిగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నడుచుకున్న 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ నర్వేకర్ ను కోరారు.
అనంతరం అజిత్ పవార్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన ముగ్గురు ఎన్సీపీ నేతలు నరేంద్ర రాథోడ్, విజయ్ దేశ్ ముఖ్, శివాజీరావు గార్జే లపై వేటు వేసిన పార్టీ శరద్ పవార్ ఇప్పుడు కీలక నేతలపై కొరడా ఝళిపించారు. జాతీయ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తాత్కారేల పార్టీ సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ట్విట్టర్లో రాస్తూ.. ఎన్సీపీ జాతీయాధ్యక్షుడిగా పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటూ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకుగాను శ్రీ సునీల్ తాత్కారే, ప్రఫుల్ పటేల్ లను పార్టీ నుండి తొలగిస్తున్నామని తెలిపారు.
I, as the National President, Nationalist Congress Party hereby order removal of the names of Shri Sunil Tatkare and Shri Praful Patel from the Register of Members of NCP Party for anti-party activities.@praful_patel @SunilTatkare
— Sharad Pawar (@PawarSpeaks) July 3, 2023
ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే..
Comments
Please login to add a commentAdd a comment