మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి సునేత్ర పవార్‌ను బారామతి లోక్‌సభ స్థానం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) బరిలో నిలిపింది. పార్టీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత నిర్వహించిన కార్యక్రమంలో సునేత్ర పవార్ మాట్లాడుతూ ప్రజల మద్దతు కోరారు.
"మీరు ( బారామతి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు ) మాకు మద్దతు ఇస్తే, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం" అని సునేత్ర అన్నారు. తన భర్త అజిత్ పవార్ చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. వాటి పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తానూ తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు "దాదా" ( అజిత్ పవార్‌ను మద్దతుదారులు ఇలా పిలుస్తారు) ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయనకు ప్రజల సమస్యలు తెలియజేయడం వరకే తన పాత్ర ఉండేదని ఆమె చెప్పారు. "నా పేరు బారామతికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీరు మాకు అవకాశం ఇస్తే, మేమిద్దరం ( అజిత్ పవార్, సునేత్ర పవార్ ) మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం" అన్నారు.
ఆడపడుచు స్థానంలోకి అన్న భార్య..
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమవుతుండటంతో సునేత్రా పవార్ అభ్యర్థిత్వంపై గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి అభ్యర్థి సునేత్రా పవార్ . బారామతి సీటు ప్రస్తుతం అజిత్ పవార్ సోదరి, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే (Supriya Sule) చేతిలో ఉంది. సూలే 2009 నుండి బారామతి ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ 1996 నుండి 2009 వరకు ఆ స్థానాన్ని పవార్ కుటుంబానికి బలమైన కోటగా పరిగణించారు.
Comments
Please login to add a commentAdd a comment