Maharashtra Political Crisis: Supriya Sule Hits Back At Ajit Pawar Comments - Sakshi
Sakshi News home page

అమితాబ్‌కు 82 ఏళ్ళు.. యాక్టివ్‌గా లేరా?.. అజిత్‌ పవార్‌కు వ్యాఖ్యలపై సుప్రియా సూలే స్పందన

Published Wed, Jul 5 2023 6:40 PM | Last Updated on Wed, Jul 5 2023 8:22 PM

Supriya Sule Hits Back At Ajit Pawar Comments - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తోన్న ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చిన అజిత్ పవార్ రాజకీయ నాయకుల వయసు ప్రస్తావన తీసుకొచ్చి వినూత్న వాదనకు తెరతీశారు. వయసు మీదపడ్డ శరద్ పవార్ ను తప్పుకుని కొత్తనీరుకి దారినివ్వాల్సిందిగా చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఘాటుగా సమాధానమిచ్చారు  

ఎన్సీపీ తిరుగుబాటు వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు మార్గదర్శకమని, 75 ఏళ్ళు దాటిన రాజకీయ నాయకులు రాజకీయాల్లో కొనసాగడం ఆ పార్టీలో ఉండదని చెబుతూ ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి లను ఉదహరించారు. 

ప్రస్తుతం మీ వయసు 83.. కాబట్టి ఇంక చాలు రిటైర్మెంట్ ప్రకటించండి.. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము మీ దీర్గాయుష్షును కోరుకుంటామని.. అలా చేయడం వలన కొత్త తరం కొత్త ఉత్సాహంతో పనిచేస్తుందని అన్నారు. 

అజిత్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎంపీ, ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుప్రియా సూలే స్పందిస్తూ.. ‘‘అమితాబ్ బచ్చన్ వయసు 82 ఏళ్ళు.. ఇప్పటికీ ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీకోపం మాపైనే కదా.  కాబట్టి మమ్మల్ని తిట్టినా సహిస్తాం. కానీ మా నాన్నగారిని అమర్యాదగా మాట్లాడితే మాత్రం సహించబోమని అన్నారు. 

ఎదుటివారి వయసు పెరిగింది మమ్మల్ని ఆశీర్వదించమని అడిగే ముందు అసలెందుకు ఆశీర్వదించాలని ప్రశ్నించుకోవాలి. రతన్ టాటా సాహెబ్ కంటే కేవలం మూడేళ్లే పెద్దవారు. అయినా దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించడంలేదా అని అడిగారు.  

అవినీతిని పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వంపైనే మా పోరాటం. అసలైన ఎన్సీపీ పార్టీ శరద్ పవార్ తోనే ఉందని మా గుర్తు మాతోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.  

   

ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement