ముంబై: హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను లోక్‌సభ ఎన్నికలకు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి బీజేపీ తొలగించింది. తమ పార్టీకి చెందిన నేతలు మాత్రమే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని, ఇతర పార్టీ నేతలు అవకాశం లేదంటూ మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాసిన లేఖ కారణంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.
శివసేన, మహారాష్ట్ర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇతర పార్టీల నేతలు ఉన్నారు. శివసేన లిస్ట్‌లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండగా.. రాష్ట్ర బీజేపీ జాబితాలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఉన్నారు.
అయితే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాశారు. అదే పార్టీకి చెందిన వాళ్లే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని చెబుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950ని ఉదహరించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా పేర్కొంటూ సవరించిన జాబితాను బీజేపీ భారత ఎన్నికల సంఘానికి సమర్పించింది.
చదవండి: దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు!
Comments
Please login to add a commentAdd a comment