ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరే ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశాలకు అజిత్ పవార్ గైర్హాజరవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సాధించాయి.
బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి ఎన్సీపీ రెబెల్ అజిత్ పవార్ హాజరు కాకపోగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో కూడా ఆయన కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు ట్రిపుల్ ఇంజిన్ సర్కారుకు ట్రబుల్ మొదలైందని చెబుతున్నాయి. ఎన్సీపీ రెబెల్ మంత్రులకి జిల్లా సహాయక మంత్రులుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అజిత్ పవార్ మరోసారి అలకపాన్పు ఎక్కినట్టు తెలుస్తోంది. బీజేపీకి చెందిన చంద్రకాంత్ పాటిల్‌కు పూణే జిల్లా సహాయక మంత్రిగాను దిలీప్ వాల్సే పాటిల్‌కు బుల్దానా జిల్లా, హాసన్ ముష్రిఫ్‌కు కొల్హాపూర్ జిల్లా, ధనుంజయ్ ముండేను బీడ్ జిల్లాకు సహాయక మంత్రులుగా ప్రకటించింది షిండే ప్రభుత్వం.
తనవారికి మంత్రి పదవులు దక్కనందునే అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నరని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు విజయ్ వాడెట్టివార్. ఇదిలా ఉండగా ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాత్రం అజిత్ పవార్ వర్గంపై ఘాటు విమర్శలు చేశారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ట్రబుల్ మొదలయిందన్నారు.నిరాశలో ఉన్న వర్గం ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు తమ అసంతృప్తిని తెలిపినట్టు సమాచారం అందింది. హనీమూన్‌కు వెళ్లి మూడు నెలలైనా కాలేదు అప్పుడే ప్రభుత్వంలో ముసలం మొదలైందని వార్త్లు వస్తున్నాయి. అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారని ప్రశ్నించారు.
ఎన్సీపీ తిరుగువర్గంలో మరో ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌బల్ మాత్రం అజిత్ పవార్ గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని కేబినెట్ సమావేశాలకు ఎలా హాజరవుతారని, ఢిల్లీ పర్యటనకు ఎలా వెళతారని ప్రశ్నిస్తూనే రాజకీయంగా మాకు ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు.
ఇది కూడా చదవండి: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Comments
Please login to add a commentAdd a comment