ముంబై : రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో అత్యంత సాధారణ రకాలు హిట్ అండ్ రన్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక వ్యక్తిని ఢీ కొట్టి అతని పరిస్థితి ఎలా ఉందో? పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయినప్పుడు దాన్ని హిట్-అండ్-రన్‌గా పరిగణిస్తారు. తాజాగా, హిట్-అండ్-రన్ ప్రమాదంలో మృతి చెందిన 82 ఏళ్ల పురుషోత్తం కేసులో విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల కథనం ప్రకారం..నాగపూర్ సిటీలో అర్చనా మనీష్ పుట్టేవార్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మనీష్ పేరున్న డాక్టర్. టౌన్ ప్లానింగ్ అధికారిణిగా నగరంలో తనకున్న పేరు పలుకుబడితో భారీ ఎత్తున ఆస్తుల్ని పోగేశారు. అయినప్పటికీ మామ పూరుషోత్తం పుట్టేవార్ ఆస్తిపై కన్నేసింది. ఆయనకున్న రూ.300 కోట్ల ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేసింది.
ఇందుకోసం అర్చన తన క్రిమినల్ మైండ్‌కు పదును పెట్టింది. తన మామను కారుతో ఢీకొట్టి అది ప్రమాద మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. హత్య చేయించేందుకు ఆమె భర్త డ్రైవర్ బాగ్డే, నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌లకు కోటి రూపాయిలకు సుపారీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే?
అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసేందుకు పురుషోత్తం ఆస్ప్రత్రికి వెళ్లారు. తిరిగి వస్తున్న ఆయనను ప్లాన్‌లో భాగంగా కారుతో ఢీకొట్టిచ్చింది.రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడడంతో స్థానికుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పురుషోత్తంకు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీపుటేజీని నిశితంగా పరిశీలించగా..అందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పురుషోత్తంకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని, హిట్-అండ్-రన్ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ కారులో ప్రయాణిస్తున్న బాగ్డే, నీరజ్,సచిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్‌లో విచారించగా.. కోడలు అర్చన భాగోతం బట్ట బయలైంది. ఆస్తి కోసమే అర్చన తన మామ పురుషోత్తంను హతమార్చేందుకు సిద్దపడినట్లు తేలడంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పురుషోత్తం 15 రోజుల పాటు పోరాడి చివరికి ప్రాణాలొదిలినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment