
ముంబై : మహారాష్ట్రలో ప్రమాదం సంభవించింది. ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మరణించారు. కనీసం 5 నుండి 6 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ విభాగంలో ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పైకప్పు కూలిపోయింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జేసీబీ సాయంతో రెస్క్యూ సిబ్బంది శిధిలాలను తొలగిస్తున్నారు. శిధిలాల కింద ఉన్న బాధితుల్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు.
At least 7 people were killed and several injured in a major explosion at the ordnance factory in Bhandara; rescue efforts underway. #Maharashtra #Explosion #Bhandara #OrdnanceFactory pic.twitter.com/XP21qWEKHV
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) January 24, 2025