
సాక్షి,ముంబై : లోక్‌సభ ఎన్నికల తరుణంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహరాష్ట్ర వేగంగా అభివృద్ది చెందడానికి ప్రధాని మోదీ మద్దతు, ఆశీర్వామే కారణమన్నారు.
మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగింది. ఈ 1.5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయడంలో విజయం సాధించాం. అందుకు ప్రధాని మోదీ ఆశీర్వాదమే కారణం.
ప్రధాని మా ప్రభుత్వానికి పూర్తి బలం, మద్దతు ఇచ్చారు. ఎన్ని పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించారో మీరందరూ చూశారు. ఈ 1.5 ఏళ్లలో ప్రభుత్వం ఎన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంది. అదంతా ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment