ముంబై : మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్ వర్గం)ల మధ్య ఫలు దఫాలుగా జరిగిన సీట్ల పంపకం కొలిక్కి రాలేదు. తమ పార్టీ ఎక్కువ సీట్లు కావాలని శివసేన షిండే వర్గం పట్టుబడుతుంటే..తామే అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ తెగేసి చెబుతోంది. పైగా విమర్శలు..ప్రతి విమర్శలతో నాయకులు మహరాష్ట్ర రాజకీయాన్ని మరింత హీటుపుట్టిస్తున్నారు.
బీజేపీ గొప్పతనం వల్లే
బీజేపీ, శివసేన (షిండే వర్గాల)ల మధ్య సీట్ల పంపకాల చర్చలు అడ్డంకిగా మారాయి. బీజేపీ గొప్పతనం వల్లే సేన అధికారంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలకు సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ ఉద్ధవ్ ఠాక్రేపై షిండే తిరుగుబాటు చేయకుంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉండి ఉండేదని బదులిచ్చారు. తమకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అందుకే (ఏక్‌నాథ్ షిండేని ఉద్దేశిస్తూ) ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నథ్ షిండే తిరుగుబాటు చేయకుంటే 105 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండి ఉండేవారని, షిండే వల్లే తాము అధికారంలోకి వచ్చామని శిర్సత్ అన్నారు.
బెదిరింపులు తగదు
అంతకుముందు బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేశామని ఫడ్నవీస్ అన్నాంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫడ్నవీస్ వ్యాఖ్యలకు.. షిండే వర్గాన్ని బెదిరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, సొంత ఖర్చుతోనే మరిన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని ఏక్‌నాథ్ షిండే సన్నిహితుడు రాందాస్ కదమ్ అన్నట్లు కథనాల్లో తెలిపాయి.
విభేదాలు ఎందుకంటే?
శివసేనకు బీజేపీ కేవలం 8 లోక్‌సభ సీట్లను ఆఫర్ చేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం శివసేన ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న కనీసం నాలుగు స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని భావిస్తోంది. అజిత్ పవార్‌కి చెందిన ఎన్సీపీ కూడా తమకు కేవలం 3 సీట్లు మాత్రమే ఆఫర్ చేసిందని మండిపడుతోంది. సీట్ల పంపకాల సమస్యల పరిష్కారానికి మూడు పార్టీల నేతలు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. మరి ఈ సారైనా సీట్ల పంపకం కొలిక్కి వస్తుందా? రాదా? అనేది వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment