ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి పార్టీ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అత్యున్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లు మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు.
ఇరువురి నేతల భేటీలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరు, త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఎన్నికల తరహాలో ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా కార్యకర్తలకు, నేతలకు భవిష్యత్ కార్యచరణపై దిశానిర్ధేశం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇండియా కూటమి తరుఫున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలపై శరద్ పవార్ సుప్రీం కోర్టు ఆశ్రయించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.
మహా ఎన్నికల్లో ఘోర పరాజయం
ఈ నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
Maharashtra: At the anti-EVM event at Markadwadi village in Solapur district, NCP-SCP chief Sharad Pawar says, "Elections happen...some win some lose...but in recently concluded election in Maharashtra, people have doubt over the election process and voters are not feeling… pic.twitter.com/QkmKK5XNQU
— ANI (@ANI) December 8, 2024
అయితే, ఈ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ విజయం సాధిస్తుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇదే కూటమిలో తమ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్సీపీ నేతలు అంచనా వేశారు. కానీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. ఊహించని విధంగా ఎన్సీపీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలపై దేశంలో ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈవీఎం ఓటింగ్‌పై సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment