old woman dies
-
యాదాద్రి: వైద్యం అందక రిక్షాలోనే వృద్ధురాలి మృతి
సంస్థాన్ నారాయణపురం: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ నిరుపేద వృద్ధురాలు ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్యం కోసం వేచి చూసి ప్రాణాలొదిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన పూస బాలమ్మ(80) ఆలనాపాలనా చూసేవారు లేరు. దీంతో కొద్దిరోజుల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నివసిస్తున్న కూతురు సైదమ్మ వద్దకు వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలమ్మ 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించింది. దీంతో సంస్థాన్ నారాయణపురం పీహెచ్‌సీకి తీసుకొచ్చి కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చింది. వైద్యం కోసం గంటపాటు రిక్షాలోనే ఎదురుచూసింది. వైద్యురాలు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. తన తల్లి మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సైదమ్మ ఆరోపించింది. ‘ఆహారం తీసుకోకపోవడంతో బాలమ్మ నీరసంగా ఉంది, పల్స్ పడిపోవడంతోనే మృతి చెందింది. నేను సిబ్బందితో నెలవారీ సమావేశంలో ఉన్నా. తెలిసిన వెంటనే వచ్చి పరిశీలించాను’అని వైద్యురాలు దీప్తి వివరణ ఇచ్చారు. -
పింఛన్ కోసం వచ్చి వృద్ధురాలి మృతి
కుందుర్పి: పింఛన్ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు గంటల తరబడి వేచి చూసి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... బెస్తరపల్లికి చెందిన లక్ష్మమ్మ (68) మంగళవారం పింఛన్ తీసుకునేందుకు ఉదయం పది గంటలకే గ్రామ సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం మూడుగంటలు దాటినా పింఛన్ అందలేదు. అన్నపానీయాలు లేకుండా వేచి గంటతరబడి వేచి ఉన్న అక్కడే కుప్పకూలిపోయింది. తోటిపింఛన్దారులు పరిశీలించగా ఆమె ప్రాణం విడిచినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
గుంతలో పడి వృద్ధురాలి మృతి
లేపాక్షి (హిందూపురం) : లేపాక్షి రెవెన్యూ కార్యాలయం ఎదుట గల చింతతోపులోని గుంతలో పడి ఇదే మండలం రాజీవ్‌కాలనీకి చెందిన బి.ఎల్.నరసమ్మ(70) గురువారం మృతి చెందిన ఏఎస్ఐ సుబ్బరాం నాయక్ తెలిపారు. వృద్ధురాలు అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయేదన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోగా అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. అయినా ఫలితం లేదు. చివరకు చింతతోపులోని గుంతలో పడి మృతి చెంది ఉండగా పశువుల కాపరులు గుర్తించారన్నారు. వెంటనే తమకు సమాచారం అందించడంతో సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించినట్లు ఆయన వివరించారు. ఆరా తీయగా.. రాజీవ్‌కాలనీకి చెందిన నరసమ్మ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీరామప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
రైలు కింద పడి వృద్ధురాలు మృతి
అనంతపురం న్యూసిటీ : అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలువ సమీపంలో గల రైలు పట్టాలపై పడి గుర్తు తెలియని వృద్ధురాలు(65) ఆదివారం మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలికి కాలు, చేయి సరిగ్గా లేకపోవడంతో వికలాంగురాలిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వడియంపేటకు చెందిన పామిశెట్టి పోలేరమ్మ (70) అంగడికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వద్ద బొలెరో వాహనాన్ని రివర్స్ తీసుకుంటూ పోలేరమ్మను ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలపాలైన పోలేరమ్మను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో గొడవ.. ఎంత పని చేసింది!
భార్యతో గొడవ జరగడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలని మూడు అంతస్థుల పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకినా, అతడి ప్రాణాలు పోలేదు సరికదా.. అక్కడ కింద పడుకొని ఉన్న 75 ఏళ్ల వృద్ధురాలి మీద అతడు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాంతో అతడి మీద పోలీసు కేసు నమోదైంది. శారద అనే ఆ వృద్ధురాలు చల్లగాలి కోసం ఆరుబయట మంచం వేసుకుని అక్కడే పడుకుంది. ఆటోడ్రైవర్‌గా జీవనాన్ని కొనసాగించే సెల్వమురుగన్ (37) ఇక జీవితాన్ని చాలించాలనుకుని మూడో అంతస్థు పైకి ఎక్కడి అక్కడి నుంచి దూకాడు. అయితే ఆ సమయంలో కింద వృద్ధురాలున్న విషయాన్ని అతడు గుర్తించలేకపోయాడు. సరిగ్గా ఆమె మీద పడటంతో ఆమె అక్కడే మరణించింది. సెల్వమురుగన్ తలకు కూడా గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. కిందకు దూకే సమయానికి అతడు తాగేసి ఉన్నాడని పోలీసులకు తెలిపారు. తన భార్య ధనలక్ష్మితోను, బావమరిదితోను అతడికి గొడవ అయ్యిందని, దాంతో తాను చచ్చిపోతానని వాళ్లకు చెప్పి మేడమీదకు ఎక్కాడని అన్నారు. అయితే, అతడు ప్రతిసారీ అలాగే చెబుతుండటంతో వాళ్లు పట్టించుకోలేదన్నారు. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి అతడు కిందకు దూకేశాడు. కింద వృద్ధురాలి మీద పడినప్పుడు ఆమె అరవడంతో చుట్టుపక్కల వాళ్లు లేచారు. వెంటనే వాళ్లు సెల్వమురుగన్, శారదలను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాళ్లు రాయపేటలోని ప్రభుత్వాస్పత్రికి పంపగా అక్కడ శారద మరణించారు. తలకు, కాళ్లకు తీవ్రగాయాలైన సెల్వ మురుగన్‌ను రాజీవ్ ప్రభుత్వాస్పత్రికి పంపారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శారద ప్రాణాలు కోల్పోవడంతో సెల్వమురుగన్‌పై కేసు నమోదు చేశారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
ఉరవకొండ: స్థానిక 10వ వార్డు ఎస్సీ కాలనీలోని వుూగ బసవన్న కట్ట వద్ద నివాసముంటున్న శతాధిక వృద్ధురాలు తొండ్లం మారెక్క (108) బుధవారం కన్నుమూసింది. వృద్ధురాలు నూరేళ్ల వయుస్సుపై బడినా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తానే చేసుకొనేదని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.