భార్యతో గొడవ.. ఎంత పని చేసింది! | man jumps from third floor, woman on ground dies | Sakshi
Sakshi News home page

భార్యతో గొడవ.. ఎంత పని చేసింది!

Published Tue, Aug 30 2016 12:23 PM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

భార్యతో గొడవ.. ఎంత పని చేసింది! - Sakshi

భార్యతో గొడవ.. ఎంత పని చేసింది!

భార్యతో గొడవ జరగడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలని మూడు అంతస్థుల పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకినా, అతడి ప్రాణాలు పోలేదు సరికదా.. అక్కడ కింద పడుకొని ఉన్న 75 ఏళ్ల వృద్ధురాలి మీద అతడు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాంతో అతడి మీద పోలీసు కేసు నమోదైంది. శారద అనే ఆ వృద్ధురాలు చల్లగాలి కోసం ఆరుబయట మంచం వేసుకుని అక్కడే పడుకుంది. ఆటోడ్రైవర్‌గా జీవనాన్ని కొనసాగించే సెల్వమురుగన్ (37) ఇక జీవితాన్ని చాలించాలనుకుని మూడో అంతస్థు పైకి ఎక్కడి అక్కడి నుంచి దూకాడు. అయితే ఆ సమయంలో కింద వృద్ధురాలున్న విషయాన్ని అతడు గుర్తించలేకపోయాడు. సరిగ్గా ఆమె మీద పడటంతో ఆమె అక్కడే మరణించింది. సెల్వమురుగన్ తలకు కూడా గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.

కిందకు దూకే సమయానికి అతడు తాగేసి ఉన్నాడని పోలీసులకు తెలిపారు. తన భార్య ధనలక్ష్మితోను, బావమరిదితోను అతడికి గొడవ అయ్యిందని, దాంతో తాను చచ్చిపోతానని వాళ్లకు చెప్పి మేడమీదకు ఎక్కాడని అన్నారు. అయితే, అతడు ప్రతిసారీ అలాగే చెబుతుండటంతో వాళ్లు పట్టించుకోలేదన్నారు. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి అతడు కిందకు దూకేశాడు. కింద వృద్ధురాలి మీద పడినప్పుడు ఆమె అరవడంతో చుట్టుపక్కల వాళ్లు లేచారు. వెంటనే వాళ్లు సెల్వమురుగన్, శారదలను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాళ్లు రాయపేటలోని ప్రభుత్వాస్పత్రికి పంపగా అక్కడ శారద మరణించారు. తలకు, కాళ్లకు తీవ్రగాయాలైన సెల్వ మురుగన్‌ను రాజీవ్ ప్రభుత్వాస్పత్రికి పంపారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శారద ప్రాణాలు కోల్పోవడంతో సెల్వమురుగన్‌పై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement