కుందుర్పి: పింఛన్ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు గంటల తరబడి వేచి చూసి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... బెస్తరపల్లికి చెందిన లక్ష్మమ్మ (68) మంగళవారం పింఛన్ తీసుకునేందుకు ఉదయం పది గంటలకే గ్రామ సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం మూడుగంటలు దాటినా పింఛన్ అందలేదు. అన్నపానీయాలు లేకుండా వేచి గంటతరబడి వేచి ఉన్న అక్కడే కుప్పకూలిపోయింది. తోటిపింఛన్‌దారులు పరిశీలించగా ఆమె ప్రాణం విడిచినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.