అనంతవరం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
తాడికొండ : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను రాష్ట్ర ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో నిర్వహించను ంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, ఇతర అధికారులు ఆదివారం ఆ గ్రామాన్ని సందర్శించి స్థల పరిశీలన చేశారు. గ్రామ ప్రవేశానికి ముందు రోడ్డుపక్కన ఉన్న పొలాన్ని వేదికగా నిర్ణయించారు. తొలుత కలెక్టర్, ఎస్పీ గ్రామంలోని కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యే పూజలు నిర్వహించారు. అనంతరం పండుగనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండపైకి వచ్చి పూజలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి దేవాదాయశాఖ అసిస్టెంటు కమిషనరు పీవీ శ్రీనివాసరావుతో చర్చించారు.
ప్రధాన రహదారి నుంచి సీఎం కాన్వాయ్ ఎటు నుంచి రావాలి, ఎటునుంచి వెళ్ళాలన్న దానిపై అధికారులతో చర్చించారు. రోడ్డుకు 75 మీటర్ల లోపల నుంచి వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. వేదిక ముందు వీఐపీ, మీడియాకు స్థలం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అదే విధంగా ప్రధాన రహదారి నుంచి వేదిక వద్దకు, వేదిక వద్ద నుంచి కొండ వరకు తాత్కాలిక రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాలకు పార్కింగ్, ప్రజలకు వేదిక వద్ద కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయాలని చెప్పారు. సీఎం కూర్చునే వేదికతోపాటు పక్కనే మరో రెండు వేదికలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వేదిక కూడా తూర్పు ముఖంతో ఉండేలా చూడాలన్నారు. వేడుకలకు వచ్చేవారికి పానకం, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొండపైకి వెళ్ళేసమయంలో సీఎం కాన్వాయ్‌లో ఏడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఘాట్‌రోడ్డుపై ట్రయల్ రన్ నిర్వహించాలని అమరావతి సీఐ హనుమంతరావును ఆదేశించారు.
సీఎం హెలిప్యాడ్‌పై ఖరారు కాని నిర్ణయం...
అనంతవరం రానున్న సీఎం కోసం హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది అధికారులు నిర్ణయించలేదు. ఉగాది రోజున సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల్లోనైనా రోడ్డుషో నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. దీంతో రోడ్డుషో రూట్ ఖారారు అయిన తరువాత మాత్రమే హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై ఓ నిర్ణయానికి వస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ రాఘవేంద్రరావు, అదనపు జేసీ ఎం.వెంకటేశ్వరావు, డీఎస్పీ మధుసూదనరావు, పలు శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉగాది వేడుకలకు స్థల పరిశీలన
Published Mon, Mar 16 2015 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement
Advertisement