సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ మధ్య దూరం మరింత రోజురోజుకీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా హాజరుకాలేదు.
కాగా రాజ్‌భవన్‌లో శుక్రవారం శ్రీ శుభకృత్ నామ ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో పాల్గొనాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతి భవన్‌కు ఆహ్వానం కూడా పంపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా గైర్హాజరయ్యారు. స్టేజ్‌పై ఉన్న ఫ్లెక్సీలోనూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఫ్లైక్సీలో కేసీఆర్ ఫోటో కనిపించలేదు.
రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు , ఈటెల రాజేందర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చడా వెంకట్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగులయ్య, పలువురు జడ్జీలు, ప్రముఖులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు.
చదవండి: ‘తెలంగాణ సర్కార్ ఏం చేస్తోందో వచ్చి చూడండి’
Comments
Please login to add a commentAdd a comment