టెన్నెస్సీలో ఘనంగా ఉగాది వేడుకలు | Tennessee Telugu Samithi conducts Ugadi celbrations  | Sakshi
Sakshi News home page

టెన్నెస్సీలో ఘనంగా ఉగాది వేడుకలు

Published Thu, Apr 12 2018 10:51 AM | Last Updated on Thu, Apr 12 2018 10:51 AM

Tennessee Telugu Samithi conducts Ugadi celbrations  - Sakshi

నాష్విల్ (అమెరికా) : టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో నాష్విల్ లో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఫాదర్ ర్యాన్ ఆడిటోరియంలో టెన్నెస్సీ తెలుగు సమితి అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో నిర్వహించిన ఈ ఉగాది సంబరాలకు డాక్టర్ దీపక్ రెడ్డి, జితేందర్ కట్కూరి, శారద కట్కూరి సమర్పకులుగా వ్యవహరించారు. స్థానిక తెలుగు వారు సుమారు 600 మందికి పైగా ఈ సంబరాలలో పాల్గొనడం విశేషం.

టెన్నెస్సీ లోని నాష్విల్ సంగీత నగరంగా పేరొందడం అందరికీ తెలిసిందే. మరి ఆ సంగీత నగరంలో ప్రముఖ తెలుగు సినీ కోయిల సునీత అడుగెడితే, రాగం అందుకుంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరంలేదు. సునీతతో పాటు మాటీవీ సూపర్ సింగర్ ఫేమ్ గాయకులు దినకర్ కూడా ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు. ముందుగా దీప్తి రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ అందరికి శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాంగ శ్రవణంతో కార్యక్రమం మొదలవగా, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేసిన భరతనాట్యం, సినీ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

సునీత, దినకర్‌లు క్లాసిక్ పాటలతో మొదలుపెట్టి జానపద, సాంఘీక, ఫాస్ట్ బీట్ పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతో వేదిక ప్రాంగణం మార్మోగిపోయింది. తర్వాత స్పాన్సర్స్ ని, సునీత, దినకర్ లను పుష్ప గుచ్ఛం, శాలువా, జ్ఞాపికలతో టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం ఘనంగా సన్మానించారు. మధ్య మధ్యలో రాఫుల్ డ్రాల్లో విజేతలకు ఉప్పాడ పట్టుచీరలు, ముత్యాల నగలు వంటి విలువైన బహుమతులు గాయని సునీత చేతులమీదుగా అందజేశారు.

దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ ఈ ఉగాది సంబరాలకు వెన్నంటి ఉండి తమ పూర్తి సహకారం అందించిన కార్యదర్శి కిరణ్ కామతం, సాంస్కృతిక కార్యదర్శి ప్రశాంతి చిగురుపాటి, ఫుడ్ కమిటీ లీడ్ నిషిత కాకాని, రిజిస్ట్రేషన్ కమిటీ లీడ్ రజని కాకి తదితర అడ్వైసరీ కమిటీ, యూత్ కమిటి సభ్యులు, అలాగే విజయవంతంచేసిన ప్రేక్షకులు, స్పాన్సర్స్, తమ పాటలతో అందరిని ఆహ్లాదపరచిన సునీత, దినకర్, ఆడియో & లైటింగ్ అందించిన డి.జె. శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్, వేదికనందించిన ఫాదర్ ర్యాన్ ఆడిటోరియం యాజమాన్యం, వేదికను చక్కగా అలంకరించిన డాజిల్ ఈవెంట్స్, రుచికరమైన విందు బోజనాలను అందించిన పారడైస్ బిర్యానీ ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి ఉగాది సంబరాలను ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement