ఉత్తర కాలిఫోర్నియాలోఉగాది సంబరాలు | MTTA Ugadi Celebrations 2017 | Sakshi
Sakshi News home page

ఉత్తర కాలిఫోర్నియాలోఉగాది సంబరాలు

Published Fri, Apr 14 2017 12:08 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

తెలుగు వారి తొలిపండుగ ఉగాది సంబరాలు ఉత్తర కాలిఫోర్నియాలో మౌంటెన్ హౌస్ ట్రెసీ తెలుగుసంఘం(ఎంటీటీఎ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

http://img.sakshi.net/images/cms/2017-04/71492152209_Unknown.jpg
కాలిఫోర్నియా :

తెలుగు వారి తొలిపండుగ ఉగాది సంబరాలు ఉత్తర కాలిఫోర్నియాలో మౌంటెన్ హౌస్ ట్రెసీ తెలుగుసంఘం(ఎంటీటీఎ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.  మౌంటెన్ హౌస్ ట్రెసీ బెతనీ మల్లీపర్సస్ రూంలో జరిగిన వేడుకల్లో మౌంటెన్ హౌస్, ట్రేసీలోని తెలుగువారు సంప్రదాయదుస్తులు ధరించి ఆట, పాటలతోఅందరిని అలరించారు.
http://img.sakshi.net/images/cms/2017-04/81492152098_Unknown.jpg

ప్రముఖ హృద్రోగ వైద్యనిపుణులు డాక్టర్ లక్కిరెడ్డిహనిమిరెడ్డి, ఇండోఅమెరికన్ కమ్యూనిటీ స్టేట్ఆఫీస్, గవర్నర్స్ ఆఫీసు కల్చరల్ అంబాసిడర్ మన్నాప్రగడశ్రీనివాస్, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రమేష్ తనిగెళపల్లి, ఎంహెచ్సీఎస్డీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ బెర్నైస్ ట్రిగిల్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
http://img.sakshi.net/images/cms/2017-04/51492152154_Unknown.jpg

అనంతరం శ్రీ సీతారామస్వామికళ్యాణం నిర్వహించారు. ఉగాది పచ్చడి కళ్యాణ పానకం ఇచ్చి అనంతరం నోరూరించే విందు భోజనం వడ్డించారు. శివపార్వతి అనంతు, స్వప్న ఆదేలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. డాక్టర్ లక్కిరెడ్డి ప్రసంగం ఆకట్టుకుంది. ఎంటీటీఎ కార్యనిర్వాహక సంఘం వారు అందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
http://img.sakshi.net/images/cms/2017-04/61492152258_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement